ప్రభాస్ కాబోయే భార్య ఆ అమ్మాయేనా? హింట్ ఇచ్చేసిన చరణ్

|

Jan 16, 2025 | 6:46 PM

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. డార్లింగ్ పెళ్లి వార్త కోసం అభిమానులు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు.. అనే సందేహాలు ఎంతోమందిలో ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటాను అని గతంలోనే చెప్పిన ప్రభాస్.. ఇప్పటివరకు మళ్లీ ఆ మాట ఎత్తడం లేదు. ఇక డార్లింగ్ పెళ్లెప్పుడు అని అడిగిన ప్రతీసారీ ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి.. తొందర్లోనే జరుగుతుందని చెప్పడంతో మరిన్ని ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఇక డార్లింగ్ పెళ్లి గురించి.. ఆయనకు కాబోయే భార్య ఈ అమ్మాయే అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ క్రియేట్ అయ్యాయి.

 కొన్నిసార్లు ఆ హీరోయిన్ తో ప్రభాస్ ప్రేమ, పెళ్లి అంటూ ప్రచారం నడిచింది. ఆ తర్వాత బంధువుల అమ్మాయినే వివాహం చేసుకుంటాడని రూమర్ వినిపించింది. అయితే ఇప్పటివరకు ఈ విషయాలపై డార్లింగ్ నేరుగా స్పందించలేదు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన స్నేహితుడు ప్రభాస్ పెళ్లి గురించి హింట్ ఇచ్చాడు. ఆయన ఎవరిని పెళ్లాడనున్నారనే విషయాన్ని ఇటీవల పాల్గొన్న అన్ స్టాపబుల్ టాక్ షోలో బయటపెట్టారు. ఈ షోలో ప్రభాస్ పెళ్లి గురించి బాలకృష్ణ ప్రశ్నించగా.. రామ్ చరణ్ నవ్వులు పూయించారు. ఆంధ్రప్రదేశ్ లోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లి చేసుకోనున్నారని చెప్పారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. దీంతో ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ హింట్ ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఆ అమ్మాయి ఎవరా ? అంటూ నెట్టింట ఆరా తీస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలైంది. మొదటి రోజే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అన్ స్టాపబుల్ టాక్ షోలో పాల్గొన్నారు రామ్ చరణ్. ఇందులో తన కూతురు క్లింకార, బాబాయ్ పవన్ కళ్యాణ్, మామయ్య అల్లు అరవింద్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ఎపిసోడ్ తొలి భాగం జనవరి 8న విడుదలైంది. రెండో భాగం జనవరి 14న ప్రసారం కానుంది.

మరిన్ని వీడియోస్ చూడండి :

గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

గేమ్‌ ఛేంజర్‌కి మించి..నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందా..?

Published on: Jan 16, 2025 05:15 PM