Puri Jagannath: ఏం జరిగినా మన మంచికే.. గాయాలు మానాకే.. అసలు సినిమా..!

Updated on: Oct 10, 2026 | 7:11 PM

దర్శకుడు పూరి జగన్నాథ్‌ తన ‘పూరి మ్యూసింగ్స్‌’లో బలమైన వ్యక్తుల గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. జీవితంలో అన్యాయం జరిగినా, బాధ కలిగినా ప్రతీకారం కోసం కాకుండా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ఒక్కరినీ నమ్మాల్సిన అవసరం లేదని, మన శక్తిని అనవసరమైన విషయాల కోసం వృథా చేయకూడదని చెప్పారు. కష్టాలు మనల్ని మరింత దృఢంగా మారుస్తాయని ఆయన సందేశమిచ్చారు.

దర్శకుడు పురి జగన్నాథ్, తన “పూరి మ్యూసింగ్స్” ద్వారా తన అనుభవాలు, ఆలోచనలను ప్రేక్షకులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే స్ట్రాంగ్ పీపుల్స్ ఎలా ఉంటారు.. ? జీవితంలో వచ్చే కష్టాన్ని ఎలా ఎదుర్కొంటారు అనే విషయాలను ఓ వీడియోలో పంచుకున్నారు పూరీ. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. “బలమైన వ్యక్తులు” ఎలా ఉంటారు, వారు జీవిత సవాళ్ళను ఎలా ఎదుర్కొంటారనే విషయాలపై పూరి తన ఆలోచనలు పంచుకున్నారు. ఆయన మాటల్లో, సాధారణ వ్యక్తులకు, నిజమైన బలం కలిగిన వ్యక్తులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. బలమైన వ్యక్తులను దగ్గరగా గమనిస్తే, వారి నుండి అనేక విషయాలు నేర్చుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. “బలమైన వ్యక్తులు ఎప్పుడైనా బాధపడినా లేదా వారికి అన్యాయం జరిగినా, గట్టిగా ఏడవరు. అన్యాయం జరిగిందని అరవరు, ఎవరితోనూ అనవసరమైన యుద్ధానికి దిగరు. తమకు జరిగిన విషయాలకు ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వరు, ఫిర్యాదు చేయరు, లేదా అనవసరమైన డ్రామాను సృష్టించరు. ఇతరుల సానుభూతి కోసం లేదా అటెన్షన్ కోసం ఎదురు చూడరు. వారి హృదయంలో ఎవరి పట్ల ఎలాంటి కోపం, ద్వేషం పెట్టుకోరు, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన అస్సలు ఉండదు. వారికి జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని లేదా బాధను గుండెల్లో పెట్టుకొని నిశ్శబ్దంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. కొంతకాలం పాటు అందరికీ దూరంగా, ఏకాంతంగా బతుకుతారు. ఈ దశలో, ఇదివరకు మనుషుల మీద ఉన్న నమ్మకం సన్నగిల్లుతుంది, పాత సంబంధాలపై ఆసక్తి ఉండదు. వ్యవస్థ మీద, సమాజం మీద అసహ్యం వేయొచ్చు, రిలేషన్స్ మీద విరక్తి కలుగుతుంది. అయినప్పటికీ, వారు అందరితో నవ్వుతూ మాట్లాడతారు, అందరి పట్ల దయతో ఉంటారు. తమ లోపల ఉన్న కష్టాన్ని ఎవరితోనూ పంచుకోకుండా, అందరితో ఎప్పటిలాగే సరదాగా, మామూలుగా ఉంటారు. ఇది వారి అంతర్గత బలానికి ప్రతీక. బలమైన వ్యక్తులు తమకు ఎవరో అన్యాయం చేశారు కదా అని, ఇంకొకరికి అన్యాయం చేయరు. దుర్మార్గుడిని గెలిచినంత మాత్రాన వారు దుర్మార్గంగా మారిపోరు. ఎప్పటిలాగే చిరునవ్వుతో, నార్మల్ గా ఉంటారు. కాకపోతే, ఈ అనుభవాల తర్వాత వారు ఇంతకు ముందుకంటే మరింత జాగ్రత్తగా, ఎంపిక చేసుకునే స్వభావంతో ఉంటారు. పనికిరాని పనుల కోసం, అనవసరమైన మనుషుల కోసం తమ శక్తిని వృథా చేయరు. ఇకపై ఏం చేసినా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. మళ్ళీ ప్రేమించడానికి లేదా కొత్త స్నేహాన్ని పెంచుకోవడానికి వందసార్లు ఆలోచిస్తారు. ఇది వారి అనుభవాల నుండి నేర్చుకున్న విజ్ఞతను తెలియజేస్తుంది” అంటూ చెప్పుకొచ్చారు.“అందుకే జీవితంలో ఏం జరిగినా మన మంచికే, ఎన్నో నేర్చుకుంటాం” అని పురి జగన్నాథ్ అన్నారు. ఎప్పుడు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, “బలవంతులుగా ఉండండి” అనే సందేశాన్నిచ్చారు. లోపల అన్ని బాధలను దాచుకుని మౌనంగా ముందుకు సాగండి. Walk away without a word. నలుగురిలో నలిగిన ప్రతిసారీ వెళ్లి ఒంటరిగా కూర్చోండి, అప్పుడే గాయాలన్నీ నయమవుతాయి. “ప్రతి గాయం తర్వాత, మీరు మరింత బలవంతులు అవుతారు”. అంటూ పూరీ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కి ధైర్యం నూరిపోశాడు. కష్టాలు బలహీనపరచడానికి కాదని, మరింత దృఢంగా, విజ్ఞతతో జీవించడానికి ఉపయోగపడతాయని పూరీ అందరికీ సందేశాన్ని ఇచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Drishyam 3: బాలీవుడ్‌కు కొత్త ఊపిరి! 500 కోట్ల దిశగా దృశ్యం కలెక్షన్స్‌

Hanuman Ansh: హనుమాన్ అంశ్ తెలుగు ఎలా ఉంటే.. హిట్టా.. ఫట్టా

Comrade Kalyan: వీడు కామెడీ కళ్యాణ్‌.. ఎలా ఉందంటే..

Sigma: ‘సిగ్మా’ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

OTTలోకి నాని ప్యారడైజ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us