నేషనల్ జియోగ్రాఫిక్ 33 లిస్టులో ప్రియాంక, ఆలియా

Edited By:

Updated on: Mar 21, 2026 | 5:54 PM

ప్రపంచవ్యాప్తంగా మార్పు తెస్తున్న ప్రముఖుల నేషనల్ జియోగ్రాఫిక్ 2026 జాబితాలో ప్రియాంక చోప్రా, ఆలియా భట్ స్థానం సంపాదించారు. ఆలియా పర్యావరణ పరిరక్షణ, ఏనుగుల వేటపై అవగాహన, జంతు దత్తత ప్రోత్సాహం కోసం కృషి చేస్తుండగా; ప్రియాంక ప్రజారోగ్యం, మధుమేహంపై ప్రచారాలు, 'బియాండ్ టైప్ 1' సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నారు. వారి సేవా కార్యక్రమాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మనకు బాగా పరిచయం ఉన్న హీరోయిన్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే జనరల్‌ గా ఏం మాట్లాడుకుంటాం? వాళ్లు చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాలు, చేయబోయే సినిమాలు.. అంతకు మించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు.. వాళ్ల ప్రొడక్షన్‌ కంపెనీలు, కొత్తగా స్టార్ట్ చేసే బిజినెస్‌లు.. ఇంకో అడుగు ముందుకేయమంటే? ప్రపంచ వ్యాప్తంగా మార్పులు తెస్తున్న ప్రముఖులకు సంబంధించి ‘నేషనల్‌ జియోగ్రాఫిక్‌33 – 2026’ జాబితాను విడుదల చేసింది. ఇందులో మన తారలు ప్రియాంక చోప్రా, ఆలియా భట్‌ స్థానం సంపాదించారు. వారిద్దరూ ఏం మార్పు కోసం ట్రై చేస్తున్నారనే టాక్‌ వెంటనే షురూ అయింది. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి ఆలియా చేస్తున్న కృషిని గుర్తించారు జియోగ్రాఫిక్‌ నిర్వాహకులు. ఏనుగుల వేటపై జరిగిన దర్యాప్తు ఆధారంగా ఓ మినీ సీరీస్‌ని ఎటర్నల్‌ సన్‌షైన్‌లో నిర్మించారు ఆలియా. దాంతో పాటు జంతువులను దత్తత తీసుకునే విషయం మీద కూడా పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ఆలియా రూట్‌కీ ప్రియాంక రూట్‌కీ తేడా ఉంది. ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రియాంక నిరంతరం కృషి చేస్తున్నారు. మధుమేహం లాంటి కీలక సమస్యల మీద ఆమె అర్థవంతమైన ప్రచారాలు చేస్తున్నారు. తన భర్త స్థాపించిన నాన్‌ ప్రాఫిటబుల్‌ సంస్థ ‘బియాండ్‌ టైప్‌ 1’లో బోర్డు మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సేవలకుగానూ ప్రియాంకకు అవార్డు వచ్చింది. సామాజిక స్పృహతో సెలబ్రిటీలు సేవా కార్యక్రమాలు ముందుకు రావడం మంచి విషయమని పొగుడుతున్నారు నెటిజన్లు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Spider-Man: ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్

Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్

దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..

Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు

వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు

Follow Us