Varanasi: మరోసారి వారణాసి గురించి చెప్పిన పృథ్వీరాజ్‌

Edited By:

Updated on: Jul 13, 2026 | 5:34 PM

రాజమౌళి సినిమాలో అవకాశం రావడం తన కెరీర్‌లో అత్యంత గొప్ప క్షణమని మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. 'వారణాసి'లో 'కుంభ' పాత్ర కోసం రాజమౌళి స్వయంగా ఫోన్ చేసి కథ చెప్పారని, ఆయన నేరేషన్ వింటుంటే సినిమా కళ్లముందే ఆవిష్కృతమైనట్లు అనిపించిందన్నారు. ఎడిటింగ్ తర్వాత తెరపై తన పాత్ర మరింత అద్భుతంగా కనిపించిందని పృథ్వీరాజ్ వెల్లడించారు.

రాజమౌళి సినిమాలో అవకాశం రావటం అంటే ఎవరికైన అదృష్టమే. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లు, కొత్త వాళ్లు ఇలా ఫీల్ అవ్వటం కామన్, కానీ ఓ స్టార్ హీరో, అది కూడా ఓ లాంగ్వేజ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న హీరో జక్కన్న గురించి చెప్పిన మాటలు ఇప్పుడు నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఆ డిటైల్స్‌ ఏంటో మీరు కూడా చూసేయండి. ఇండియన్ స్క్రీన్ మీద రాజమౌళి సినిమా అంటేనే ఓ సెన్సేషన్. అలాంటి విజువల్ వండర్‌లో నటించే ఛాన్స్ వస్తే ఏ యాక్టరైనా ఎగిరి గంతేస్తాడు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా అదే చెబుతున్నారు. ‘ఎంపురాన్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయనకు, జక్కన్న నుంచి వచ్చిన ఒకే ఒక్క మెసేజ్.. ఆ కెరీర్‌లో బెస్ట్ క్యారెక్టర్‌కు నాంధి అన్నారు. ఫస్ట్ టైమ్ తనతో ఫోన్‌లో మాట్లాడిన రాజమౌళి ‘కథ రాస్తున్నా.. అందులో పవర్‌ఫుల్ విలన్‌ పాత్రకు మీరైతే బాగుంటారు’ అని ఆఫర్ ఇవ్వటం తన కెరీర్‌లో బెస్ట్ మూమెంట్ అన్నారు. ఆ కాన్వర్జెషన్ తరువాత షెడ్యూల్‌ పూర్తి కాగానే హైదరాబాద్‌ వచ్చి స్వయంగా రాజమౌళిని కలిసి కథ విన్నారు ఈ మలయాళ స్టార్‌. రాజమౌళి కథ చెప్పిన విధానం తనను ఎంతో ఎగ్జైట్ చేసిందన్నారు పృథ్వీరాజ్‌. ఏసీ గదిలో కథ చెబుతున్నా.. నేరేషన్ పూర్తయ్యే సరికి జక్కన్నకు చెమటలు పట్టేశాని, ఆయన కథను అంత ఎమోషనల్‌గా నెరేట్ చేస్తారని గుర్తు చేసుకున్నారు. ఆయన కథ చెప్పిన విధానంతో అప్పుడే తాను పూర్తి సినిమా చూసేశానన్నారు. రాజమౌళి కథ చెప్పే తీరులోనే విజువల్స్ కళ్లముందు మెదిలాయని, ఎడిటింగ్‌ అయ్యాక చూస్తే చెప్పినదానికంటే వందరెట్లు అద్భుతంగా తన క్యారెక్టర్‌ స్క్రీన్‌పై కనిపించిందని గుర్తు చేసుకున్నారు పృథ్వీరాజ్. ‘వారణాసి’లో ‘కుంభ’గా నటించడం తన అదృష్టమని ఎమోషనల్ అయ్యారు. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ఐ, నోబడి సినిమా ప్రమోషన్‌లో ఈ విషయాలు రివీల్ చేశారు పృథ్వీరాజ్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

Follow Us