డ్రాగన్..మాఫియా కథ కాదా..నీల్ సంచలన కామెంట్స్

Edited By:

Updated on: May 25, 2026 | 8:20 AM

డ్రాగన్ సినిమా టీజర్ చూసాక.. కళ్లు మూసుకుని చెప్పేయొచ్చు ఇది డ్రగ్ మాఫియా బ్యాక్‌డ్రాప్ సినిమా అని..! ఇందులో ఎన్టీఆర్‌తో పాటు అందరూ వెళ్లేది ఆ దారిలోనే అని..! కానీ ప్రశాంత్ నీల్ బుర్రలో మాత్రం వేరే ఉంది. ఈ సినిమా విషయంలో అసలెవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారీయన. డ్రాగన్ మెయిన్ థీమ్ తెలిస్తే తారక్ ఫ్యాన్స్‌కు కూడా షాక్ తప్పదు. మరి ఇంతకీ ఏంటది..?

జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటేనే మ్యాటర్ అర్థమైపోతుంది. పైగా ఆ టీజర్‌లోనే స్టోరీ అంతా చెప్పేసారు నీల్. స్వాంత్రత్య్రానికి పూర్వం మొదలైన కథ.. ఇప్పటికీ సాగుతుందన్నట్లు హింటిచ్చారు. టీజర్ నిండా విలన్లే ఉన్నారు తప్ప ఒక్క హీరో కూడా కనిపించలేదు. పైగా తారక్ క్యారెక్టర్‌ను కూడా నెగిటివ్ షేడ్‌లోనే పరిచయం చేసారు ప్రశాంత్ నీల్. కథలో మెయిన్ ప్లాట్ డ్రగ్ మాఫియా అనేది టీజర్‌లోనే ఓపెన్ చేసారు. పైగా హెరాయిన్ అంటూ క్లారిటీగా చెప్పారు.. రెండు వర్గాల మధ్య పోరు అంటూ డిసైడ్ చేసారు నీల్. ఇన్ని చెప్పాక.. బ్యాక్‌డ్రాప్ కూడా అదే కదా అనుకుంటారు. డ్రాగన్ పక్కా ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా అని ఫిక్సైపోయిన తరుణంలో.. ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. మీరంతా అనుకుంటున్నట్లు డ్రాగన్ మాఫియా బేస్డ్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా ఇప్పటి వరకు చూడని ఓ గొప్ప దేశభక్తి సినిమా అంటూ బాంబ్ పేల్చారు ఈ దర్శకుడు. క్లైమాక్స్ అయ్యేసరికి డ్రాగన్ అద్భుతమైన పేట్రియాట్ సినిమాగా నిలిచిపోతుందని హామీ ఇస్తున్నారు నీల్. ఈ లెక్కన ఇండిపెండెన్స్ తర్వాత ఇండియాలో డ్రగ్‌ని అరికట్టడానికి హీరో సీక్రేట్ మిషన్ చేస్తాడా.. దేశం కోసం హీరో ఎలా పోరాడతాడు అనే కోణంలో కథ సాగుతుందా అనే ఆసక్తి మొదలైంది. వీటన్నింటికీ జూన్ 11, 2027న సమాధానం దొరకనుంది.

మరిన్ని వీడియో కోసం : 

న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!

జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ

చాలా ఏళ్లుగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్‌ఖాన్

దృశ్యం 3 హిట్టా..? ఫట్టా..?

Follow Us