బక్కోడి ఖాతాలో బిగ్ హిట్ !! డ్రాగన్‌కు దిమ్మతిరిగే కలెక్షన్స్‌

Updated on: Oct 21, 2025 | 4:46 PM

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ సినిమా సినిమాకి అమాంతంగా పెరిగిపోతోంది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్‌ లేకుండా దర్శకుడిగా తెరంగేట్రం చేసిన ప్రదీప్.. ఇప్పుడు సక్సెస్ ఫుల్ హీరోగా సౌత్ ఇండియాలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో హిట్స్ అందుకున్న ప్రదీప్.. ఇప్పుడు డ్యూడ్ మూవీతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమాకు కొత్త డైరెక్టర కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దాంతో పాటే కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. ప్రదీప్ నటించిన గత రెండు చిత్రాలు తెలుగులో విజయం సాధించడంతో ఇప్పుడు డ్యూడ్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన డ్యూడ్ మూవీ.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.22 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళు చేసి అందర్నీ షాకయ్యేలా చేసింది. ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లోనే మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా డ్యూడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతకు ముందు ప్రదీప్ నటించిన డ్రాగన్ సినిమ్ తొలిరోజే రూ.14 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇప్పుడు డ్యూడ్ మూవీ మాత్రం వరల్డ్ వైడ్ రూ.22 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు వీకెండ్స్, దీపావళి సెలవు కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగనున్నాయని తెలుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డోంట్‌ ట్రబుల్‌ ద ట్రబుల్‌ అంటున్న ఫహాద్ ఫాజిల్‌

మీ ఓవర్ థింకింగ్‌ని తగ్గించే జపనీస్ టెక్నిక్స్ ఇవే

లవ్ సింబల్‌లా తాటి చెట్లుపల్లెలో ప్రకృతి దృశ్యం

పసరికపాము అనుకునేరు.. కాటు వేస్తే కాటికే…

టీచర్లకు బిగ్ రిలీఫ్.. ఎగ్జాం పేపర్లు దిద్దుతున్న.. ఏఐ