Salaar Sooreedu Song: ఒకడు గర్జన.. ఒకడు ఉప్పెన.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సలార్ సాంగ్.!
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల విడుదలై ట్రైలర్‌తో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. తాజాగా సలార్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. “సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజం తట్టి..
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఇటీవల విడుదలై ట్రైలర్‌తో మూవీపై మరింత హైప్ క్రియేట్ చేసిన మేకర్స్.. తాజాగా సలార్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. “సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజం తట్టి.. చిమ్మ చీకటిలోనూ నీడల ఉండేటోడు.. రెప్పనొదలక కాపు కాసేడి కన్ను వాడు.. ” అంటూ సాగే ఈ పాటలోనే ప్రభాస్, పృథ్వీరాజ్ మధ్య స్నేహాన్ని చూపించబోతున్నారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. కృష్ణ కాంత్ ఈ పాటకు లిరిక్స్ అందించగా.. హరిణి ఇవతూరి ఆలపించారు. ఎమోషనల్ గా సాగుతున్న ఈ పాట ఆకట్టుకుంటుంది.
కేజీఎఫ్ తర్వాత నీల్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ప్రభాస్ యాక్షన్ లుక్‍లో కనిపించనున్నాడు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత డార్లింగ్ మాస్ యాక్షన్ సినిమాలో నటిస్తుండడంతో ఈ మూవీపై భారీ హైప్ నెలకొంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా ఈనెల 22న క్రిస్మస్ కానుకగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసిన టీం.. ఇప్పుడు సాంగ్స్ విడుదల చేస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు గతంలోనే చిత్రయూనిట్ ప్రకటించింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ సెకండ్ పార్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.