టికెట్ ఇవ్వలేదని.. ఏకంగా థియేటర్‌నే కొనేశాడు.. ప్రభాస్‌ ఫ్యాన్‌తో పెట్టుకుంటే అంతే మరి!

Updated on: Oct 03, 2026 | 7:51 PM

ప్రభాస్‌పై ఉన్న అభిమానంతో అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త కాండ్రేగుల నాయుడు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘మిర్చి’ సినిమా సమయంలో వెంకటేశ్వర థియేటర్‌లో టికెట్‌ దొరకకపోవడంతో, ఎప్పటికైనా ఆ థియేటర్‌ను కొనాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకుని థియేటర్‌ను సొంతం చేసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం నిర్మాతగా మారి ‘అనకాపల్లి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

రీసెంట్‌గా వచ్చిన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో.. ఓ ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటుంది.అందులో హోటల్లో హీరోయిన్‌కు అవమానం జరగడంతో.. ఏకంగా ఆ స్టార్ హోటల్‌నే కొనేస్తాడు హీరో. అచ్చం ఇలాంటిది కాదు కానీ ఇంచు మించుగా ఇలాంటి క్రేజీ సీనే ఓ ప్రభాస్‌ ఫ్యాన్స్ లైఫ్‌లో జరిగింది. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన మిర్చి సినిమా టికెట్‌ ఇవ్వకపోవడంతో.. ఏకంగా థియేటర్‌నే కొనిపడేశాడు మన ప్రభాస్ ఫ్యాన్. ఆ ఫ్యాన్ ఎవరో కాదు.. కాండ్రేగుల నాయుడు. అనకాపల్లికి చెందిన నాయుడు వ్యాపారవేత్త. ప్రభాస్‌ అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే.. అడిగితే మా హీరో సినిమాకు టికెట్ ఇవ్వవా అన్న కోపంతోనే థియేటర్‌ను కొనేశాడు. అంతేకాదు ఇప్పుడీయన ప్రొడ్యూసర్‌గా కూడా మారి అనకాపల్లి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే ఈ విషయాన్ని రివీల్ చేశాడు. తాను ప్రభాస్‌ ఫ్యాన్‌ని అని చెప్పిన కాండ్రేగుల నాయుడు.. మిర్చి సినిమా చూడ్డానికి అప్పట్లో తన ఫ్యామిలీ తో కలిసి వెంకటేశ్వర థియేటర్‌కు వెళ్ళానని చెప్పుకొచ్చాడు. కానీ టికెట్స్ లేవు. ఫుల్ బిజీగా థియేటర్ ఉంది,. చాలా సేపు రిక్వెస్ట్ చేసినా ఆ థియేటర్‌ ఓనర్ టికెట్స్ ఇవ్వలేదు. టికెట్స్ కోసం మధ్యాహ్నం అంతా నిలుచున్నాను. అయినా టికెట్స్ ఇవ్వలేదు. అంతే ఇక ఆ రోజు నుంచి ఎప్పటికైనా ఈ థియేటర్ ని కొనాలనే టార్గెట్ పెట్టుకున్నాను. అనుకున్నట్టే ఆ థియేటర్‌ను దక్కించుకున్నానంటూ కాండ్రేగుల నాయుడు చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇదెక్కడి పీక్ ఫ్యానిజం అంటూ మనోడి వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Fahadh Faasil: చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా.. ఫహాద్‌ ఫన్నీ కామెంట్స్

ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్‌.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం

ఫిట్‌నెస్సే నా అసలు రహస్యం.. మనసు ప్రశాంతంగా ఉంటేనే రికార్డుల మోత

పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..

ప్రయాణికులకు అలర్ట్! ఇకపై రైల్లో ప్రయాణిస్తే అవి తప్పనిసరి!

Loading...
Unable to load recommendations.
Follow Us