తన స్టార్ పవర్‌ను పంచేస్తున్న ప్రభాస్.. స్నేహితుల సినిమాలకు రెబల్ స్టార్ అండ!
రెబల్ స్టార్ ప్రభాస్ తన స్టార్‌డమ్‌ను కేవలం తన సినిమాలకే కాకుండా స్నేహితుల సినిమాలకు కూడా ఉపయోగిస్తున్నారు. తాజాగా ‘సింగ్ గీతం’ ప్రమోషన్‌లో భాగంగా నాగ్ అశ్విన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అంతకుముందు ‘బైకర్’, ‘కపుల్ ఫ్రెండ్లీ’ వంటి చిత్రాలకు కూడా మద్దతు ఇచ్చారు. తనకు దగ్గరైన వారి కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తిగా ప్రభాస్ మరోసారి అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు.
ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్న రాజేరా అనే డైలాగ్ ఉంటుంది కదా బాహుబలిలో ప్రభాస్ గురించి.. మరి రాజు అన్నపుడు తన వాళ్ల గురించి ఆలోచిస్తాడు కదా.. సినిమాలోనే కాదు బయట కూడా ఇదే చేస్తున్నారాయన. తన అనుకున్న వాళ్లందరికీ తన స్టార్ పవర్‌ను పంచేస్తున్నారు రెబల్ స్టార్. కావాల్సిన సినిమాలను దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తున్నారు ప్రభాస్. తాజాగా మరో సినిమాకు ఇదే చేసారు. ప్రభాస్ స్టార్ డమ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి..? ఆయన ప్రమోట్ చేస్తే తమ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని నమ్మే నిర్మాతలు, దర్శకులు చాలా మందున్నారు ఇండస్ట్రీలో. అందుకే ప్రభాసే కావాలని వెళుతుంటారు వాళ్లు. రెబల్ స్టార్ కూడా తన అనుకున్న అందరికీ సాయం చేస్తూనే ఉంటారు. తాజాగా సింగ్ గీతం సినిమా కోసం అదిరిపోయే ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రభాస్. చూస్తున్నారుగా నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఎలా ఆడుకుంటున్నారో..? ప్రభాస్‌ను చూస్తే అందరూ చాలా సైలెంట్ అనుకుంటారు కానీ రెబల్ స్టార్‌లో ఓ చిన్న పిల్లోడు కూడా ఉన్నారు. తన అనుకున్న వాళ్ల దగ్గరే ఆ పిల్లోడు బైటికి వస్తుంటాడు. నాగీతో కల్కి చేస్తున్నారు కాబట్టి ఆ స్నేహంతో సింగ్ గీతం ప్రమోట్ చేస్తున్నారు ప్రభాస్. మరోవైపు కల్కి 2పై కూడా ఫోకస్ చేసారీయన. సింగ్ గీతంకే కాదు.. ఆ మధ్య బైకర్ సినిమా కోసం స్పెషల్ ప్రమోషనల్ వీడియో చేసారు ప్రభాస్. యువీ క్రియేషన్స్ నుంచి వచ్చిన సినిమా ఇది.. అంటే ప్రభాస్ సొంత బ్యానర్ అన్నమాట. అలాగే సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు రెబల్ స్టార్. అప్పుడెప్పుడో తనకు వర్షం లాంటి హిట్ ఇచ్చారని.. శోభన్ వారసులకు ఇప్పటికీ కృతజ్ఞత చూపిస్తుంటారు ప్రభాస్. నచ్చిన మనుషుల కోసం చిన్న, పెద్దా అని తేడా లేకుండా అన్ని సినిమాలకు ప్రమోషన్ చేస్తుంటారు ప్రభాస్. అంతా బాగానే ఉన్నా.. పక్క సినిమాలతో పాటు అప్పుడప్పుడూ మన సినిమాల ప్రమోషన్ కూడా చేయ్ అన్నా అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్‌ను అడుగుతున్నారు అభిమానులు. ప్రస్తుతం ఈయన ఫౌజీ, కల్కి 2, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళ చితాభస్మంలో కత్తెర.. అసలేం జరిగింది?
OTT గైడ్! వావ్.. 16 పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కి
Samantha: సమంత పిల్లి పేరు వెనకాల.. ఓ జ్ఙాపకం.. ఓ కష్టం.. ఓ కన్నీటి కథ ఉంది తెలుసా?
Klin Kaara: ఫైనల్‌గా క్లీంకారను చూపించిన చరణ్
హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై షాకింగ్ సీన్.. స్పోర్ట్స్ కారు నడిపిన 11 ఏళ్ల బాలుడు!