Pooja Hegde: పూజా హెగ్డే కెరీర్‌కు అదొక్కటే ఆప్షన్
పూజా హెగ్డే కెరీర్ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. సినిమాల పరాజయాలు, ఆలస్యం కారణంగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో, ఆమె తన బాలీవుడ్ చిత్రంలో గ్లామర్ గేట్స్ పూర్తిగా ఓపెన్ చేశారు. కెరీర్ పునరుజ్జీవనం కోసం, కొత్త ఆఫర్లు అందుకోవడం కోసం పూజా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ అందాల ఆరబోత ఆమెకు పూర్వ వైభవం తెచ్చిపెడుతుందా చూడాలి.
కెరీర్ చివరి స్టేజ్‌కు వచ్చాక హీరోయిన్స్ ముందు రెండే ఆప్షన్స్ ఉంటాయి.. ఒకటి అందాలు ఆరబోయాలి.. రెండు గౌరవంగా తప్పుకోవాలి. చాలా మంది మొదటి ఆప్షన్ ఎంచుకుంటూ ఉంటారు. తాజాగా పూజా హెగ్డేతో సహా..! ఓ బాలీవుడ్ సినిమా కోసం గ్లామర్ గేట్స్ పూర్తిగా ఎత్తేసారు పూజా. మరి ఈ షో ఆమెకు మరిన్ని అవకాశాలు తెచ్చి పెడుతుందా..? అసలెలా ఉంది పూజా కెరీర్..? చూస్తున్నారుగా పూజా హెగ్డే లేటెస్ట్ గ్లామర్ షో.. ఆఫర్స్ కోసం చివరి అస్త్రాన్ని కూడా ప్రయోగించారు ఈ బ్యూటీ. ముందు నుంచి గ్లామర్ షోకు పూజా విరుద్ధమేమీ కాదు కానీ మరీ ఈ స్థాయిలో మాత్రం రెచ్చిపోలేదు. బికినీలు, హాట్ షోలకు కొన్నేళ్లుగా దూరంగానే ఉన్న పూజాకు.. ఇప్పుడిక తప్పట్లేదు. రేసులో ఉండాలంటే గ్లామర్ డోస్ పెంచాల్సిందే. కొన్నేళ్లుగా పూజాకు టైమ్ అస్సలు కలిసిరావట్లేదు. చేసిన సినిమాలు ఆడట్లేదు.. కమిటైన సినిమాలు విడుదల కావట్లేదు.. నాగ చైతన్య, విజయ్ దేవరకొండ సినిమాల్లో ఛాన్సులు వచ్చినట్లే వచ్చి చేజారాయి. జన నాయగన్‌తో జాతకం మారుతుందేమో అనుకుంటే.. ఆ సినిమా రిలీజ్ ఆర్నెళ్లుగా సస్పెన్స్‌లోనే ఉంది. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ వరుణ్ ధావన్ సినిమాపైనే ఉన్నాయి. హిందీలో వరుణ్ ధావన్‌తో హై జవానీ తో ఇష్క్ హోనా హై.. తెలుగులో దుల్కర్ సల్మాన్‌తో ఓ సినిమా.. లారెన్స్‌తో కాంచన 4లో నటిస్తున్నారు. వీటిలో ముందు వరుణ్ సినిమానే రానుంది. ఇందులో గ్లామర్ షోలో హద్దులు బానే చెరిపేసారు ఈ బ్యూటీ. మరి ఈ అందాల ఆరబోత ఆమెకు అవకాశాలు తెస్తుందా.. మునపటి ఫామ్‌లోకి పూజా వస్తుందా అనేది చూడాలిక.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rakul Preet Singh: గిర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూల్స్ బ్రేక్ చేసిన రకుల్
పెద్ద మోసం.. జాగ్రత్త స్టార్ హీరో హెచ్చరిక
విజయ్ CM అయిన వేళ..త్రిషకు రూ. 12 కోట్ల జాక్ పాట్
TOP 9 ET: CM అయ్యారేమో కానీ.. అక్కడ మాత్రం ఓడిపోయారు..! | లైన్ క్లియర్ అవ్వలే