Peddi: పెద్ది హిట్టా..? ఫట్టా..? ఫైనల్‌గా కలెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి?

Updated on: Jun 14, 2026 | 5:24 PM

రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.366 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి 2026లో సౌత్ ఇండియా టాప్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ మార్క్ అయిన రూ.220 కోట్ల షేర్‌కు ఇంకా చేరువలోనే ఉంది. భారీ బడ్జెట్, నాన్-థియేట్రికల్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్ల లాభనష్టాలపై ఆసక్తికర విశ్లేషణ ఇదే.

360 కోట్ల బడ్జెట్.. పాన్ ఇండియా రేంజ్‌.. గ్లోబల్ స్టార్ టాప్‌ నాచ్ పర్ఫార్మెన్స్.. ఆలోవర్‌ వరల్డ్ హిట్ టాక్… అదిరిపోయే రేంజ్‌లో కలెక్షన్స్‌…! ఇవన్నీ పక్కకు పెడితే.. పెద్ది మూవీ అసలు బ్రేక్‌ ఈవెన్‌ను దాటిందా? ఫైనల్‌గా కలెక్షన్స్‌ ఏం చెబుతున్నాయి? బిజినెస్ లెక్కల ప్రకారం పెద్ది మూవీ హిట్టా..? ఫట్టా..? పెద్ది ప్రాఫిటబుల్ ప్రాజెక్టా కాదా.. అనేది ఈ ఎక్స్‌ప్లేనర్‌లో తెలుసుకుందాం? ఆఫ్టర్ గేమ్ ఛేంజర్ డిస్సపాయింట్మెంట్.. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ నుంచి వచ్చిన పిరియడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ పెద్ది. బుచ్చిబాబు సనా డైరెక్టర్. ఈ సినిమాలో చరణ్ క్రాస్ ఓవర్ అథ్లెట్‌గా కనిపిస్తారు. క్రికెటర్‌గా… పహిల్వాన్గా.. బ్లేడ్ రన్నర్‌గా 3 డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశాడు చరణ్. ప్రతీ షేడ్‌లో తన బెస్ట్ ఇచ్చాడు. అందులోనూ పహిల్వాన్‌గా ట్రాన్సఫాం అయ్యేందుకు విపరీతంగా కష్టపడ్డాడు. ఆ కష్టం అంతా స్క్రీన్ మీద కొట్టొచ్చినట్టు కనిపించడమే కాదు.. పెద్ది సినిమా చూసిన వారందరూ… చరణ్‌ కష్టం గురించి మాట్లాడుకుంటున్నారు. పెద్ది కోసం చరణ్ పడిన కష్టాన్ని మెచ్చుకుంటున్నారు. బుచ్చి కథ, కథనం, రెహ్మాన్ సంగీతం మాత్రమే కాదు.. చరణ్‌ పడిన కష్టం కూడా ఈ సినిమాకు కలెక్షన్స్‌ను దండిగా తీసుకొస్తున్నాయి. ఇప్పటి వరకు అంటే 9 రోజుల్లో పెద్ది మూవీ వరల్డ్ వైడ్ 366 క్రోర్ గ్రాస్‌ వసూళ్లు సాధించింది. 2026లో సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్‌గా పెద్ది మూవీ హిస్టరీ కెక్కింది. ఈ విషయాన్ని మేకర్సే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. పెద్ది జూన్ 4 రిలీజ్ అయినప్పటికీ.. జూన్ 3న పడిన పెయిడ్ ప్రీమియర్స్‌తోనే పెద్ది భారీ వసూళ్లకు తెరతీసింది. జస్ట్ ప్రీమియర్స్‌తోనే పెద్దిగాడు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 21.87 కోట్ల గ్రాస్‌ను రాబట్టాడు. రిలీజ్‌ రోజునే భారీ ఓపెనింగ్స్‌ సాధించిన పెద్ది… డే1 ముగిసేసరికి 135.36 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇక మిగతా రోజుల్లోని పెద్ది వసూలు చేసిన గ్రాస్ లెక్కలను చూస్తే…. డే2 181.8 కోట్ల గ్రాస్ వసూళ్లను … డే3 236.7 కోట్ల గ్రాస్.. డే 4 292.5 క్రోర్ గ్రాస్… డే5 315 క్రోర్ గ్రాస్… డే 6 332.1 క్రోర్ గ్రాస్… డే 7 345 క్రోర్ గ్రాస్.. డే 9 366 క్రోర్ గ్రాస్ వసూళ్లను పెద్ది సాధించింది. మేకర్స్ కూడా ఈ వివరాలకు సంబంధించిన పోస్టర్స్‌ను అఫీషియల్ గా చేశారు. రిలీజ్ డే నుంచి ఈరోజు వరకు.. మొత్తం 9 రోజులకు గాను.. పెద్ది మూవీ 366 క్రోర్ గ్రాస్ వసూళ్లు సాధించింది. అంటే ఇండియాలో దాని నికర, అంటే.. Net వసూళ్లు కనుక చూస్తే… సుమారుగా 250 కోట్ల నుంచి రూ. 265 కోట్ల వరకు ఉంటాయి. ఈ నెట్ వసూళ్ల నుంచే థియేటర్ల అద్దెలు మినహాయిస్తే, డిస్ట్రిబ్యూటర్లకు వచ్చే అసలైన లాభం.. అదే షేర్ విలువ. ఇది సుమారు 180 కోట్ల నుంచి రూ. 190 కోట్ల వరకు ఉంటుంది.అయితే పెద్ది మూవీ బ్రేక్ ఈవెన్ 220 కోట్లు.. ఆ మార్క్‌కు పెద్ది చాలా దగ్గరగానే ఉంది చెప్పొచ్చు. ట్రేడ్ విశ్లేషణ సంస్థ Sacnilk అండ్ బాక్సాఫీస్ నివేదికల ప్రకారం, విడుదలైన మొదటి 9 రోజుల వరకు ‘పెద్ది’ చిత్రం సాధించిన రోజువారీ India Net కలెక్షన్లు పరిశీలిస్తే.. పెయిడ్ ప్రీమియర్స్‌తో 18.50 కోట్లు, డే 1 రూ. 51.00 కోట్లు, డే 2 రూ. 26.90 కోట్లు, డే 3 రూ. 28.85 కోట్లు, డే 4 రూ. 31.90 కోట్లు (మొదటి వీకెండ్ భారీ వృద్ధి), డే 5 రూ. 12.05 కోట్లు, డే 6 రూ. 9.70 కోట్లు, డే 7 రూ. 7.55 కోట్లు, డే 8 రూ. 6.30 కోట్లు, డే 9 రూ. 5.15 కోట్లు, 9 రోజులకు గాను మొత్తంగా భారతదేశ నికర వసూళ్లు రూ. 198.70 కోట్లు. భారతదేశ నెట్ వసూళ్లతో పాటు, గ్రాస్ మరియు ఓవర్సీస్ మార్కెట్లను కలుపుకుని సినిమా సాధించిన ల్యాండ్‌మార్క్ వివరాలు…భారతదేశం గ్రాస్ వసూళ్లు రూ. 235.98 కోట్లు. అదే ప్రపంచవ్యాప్త మొత్తం గ్రాస్ రూ. 286.38 కోట్లు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… చిత్ర నిర్మాతలు అధికారిక పోస్టర్ల ద్వారా సినిమా ఇప్పటికే రూ. 345 నుంచి 366 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు ప్రకటించారు, కానీ ట్రేడ్ వర్గాల ట్రాకింగ్ లెక్కల ప్రకారం ఈ నంబర్ సుమారు రూ. 286 కోట్లు నుంచి 300 కోట్ల గ్రాస్‌గానే నమోదు చేశారు. పెద్ది సాధించిన ఏరియా వారి షేర్ కలెక్షన్స్ ను ఒక సారి పరిశీలిస్తే… తెలుగు రాష్ట్రాల్లో రామ్ చరణ్ మాస్ ఇమేజ్ కారణంగా తొలి రెండు రోజుల్లోనే రూ. 70.61 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం, ప్రస్తుతం 9 రోజులకు గానూ భారీ వసూళ్లను కొనసాగిస్తోంది. నైజాం రూ. 38.50 కోట్లు. సీడెడ్ రూ. 18.20 కోట్లు.ఉత్తరాంధ్ర రూ. 11.40 కోట్లు. ఈస్ట్ గోదావరి రూ. 8.10 కోట్లు. వెస్ట్ గోదావరి రూ. 5.90 కోట్లు. గుంటూరు రూ. 7.30 కోట్లు. కృష్ణా రూ. 6.40 కోట్లు. నెల్లూరు రూ. 3.20 కోట్లుమొత్తం AP-TG షేర్: సుమారు రూ. 99.00 కోట్లుగా ట్రేడ్ వర్గాల రిపోర్ట్. ఇతర ప్రాంతాల షేర్ వివరాలను పరిశీలిస్తే… కర్ణాటక లో రూ. 10.50 కోట్లను పెద్ది వసూలు చేసింది. ఇక్కడ కన్నడ వెర్షన్ కి ఇప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తమిళనాడు, కేరళలో ఆశించిన స్థాయి కంటే కాస్త తక్కువగా 3.80 కోట్లు వసూలు చేసినట్టు తెలుస్తోంది. నార్త్ ఇండియాలో కూడా 6.50 కోట్లతో అనుకున్నదాని కంటే కాస్త తక్కువగా కలెక్షన్స్‌ నమోదు చేసింది పెద్ది. అయితే ఓవర్సీస్‌ లో మాత్రం మంచి వసూళ్లను సాధించింది. యూఎస్, యూకే మార్కెట్లో 24 నుంచి 30 కోట్లు వసూళ్లు సాధించింది. ట్రేడ్ లెక్కల అంచనా ప్రకారం ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ మొత్తం షేర్ కలెక్షన్లు: సుమారు రూ. 143Cr నుంచి రూ. 160Cr. పెద్ది థియేట్రికల్ బిజినెస్ వాల్యూ సుమారు రూ. 220 కోట్లుని రిపోర్ట. ఇక ఇప్పటివరకు సుమారు 65% నుండి 70% వరకు కలెక్షన్లు రికవరీ అయ్యాయి.పెద్ది మూవీ క్లీన్ హిట్ స్టేటస్ అందుకోవాలంటే రాబోయే రోజుల్లో థియేట్రికల్ షేర్ పరంగా ఇంకా రూ. 60 కోట్ల నుంచి రూ. 75 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది.అయితే రెండో వీకెండ్ శని, ఆదివారాల వసూళ్లు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి లాభాల్లో లేదా నష్టాల్లో ముగుస్తుందనేది పూర్తిగా ఖరారు చేయనున్నాయి. అయితే ఇక్కడ అందరికీ ఓ డౌట్ వచ్చే ఉంటుంది. బుచ్చిబాబు పెద్ది మూవీకి 350 కోట్ల బడ్జెట్ అయిందని చెప్పారు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పెద్ది మమూవీ బ్రేక్ ఈవెన్ సుమారు 225 కోట్లుగా చెబుతున్నాయి. ఈ మధ్య ఎందుకు అంత తేడా? అసలు బ్రేక్ ఈవెన్‌ ను ఎలా లెక్కిస్తారంటే..? సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది డిస్ట్రిబ్యూటర్లు కొనుగోలు చేసిన థియేట్రికల్ హక్కుల విలువ ఆధారంగా నిర్ణయించబడుతుంది, అంతే కానీ కేవలం మొత్తం బడ్జెట్ ఆధారంగా కాదు. సినిమా మొత్తం బడ్జెట్‌కు, థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు మధ్య ఉన్న వ్యత్యాసానికి ప్రధాన కారణం నాన్-థియేట్రికల్ బిజినెస్. ‘పెద్ది’ సినిమా మొత్తం బడ్జెట్ రూ. 350 కోట్లు అయినప్పటికీ, థియేటర్ల ద్వారా మాత్రమే రికవరీ చేయాల్సిన అసలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు రూ. 218 – 225 కోట్లుగా ట్రేడ్ వర్గాలు నిర్ధారించాయి. సినిమా బడ్జెట్ రికవరీ రెండు విధాలుగా జరుగుతుంది. ఓ సినిమాకు అయిన మొత్తం బడ్జెట్‌ను ప్రొడ్యూసర్లు రెండుగా విభజిస్తారు. అందులో ఒకటి నాన్-థియేట్రికల్ బిజినెస్. ఇక నాన్ థియేట్రికల్ బిజినెస్‌లో సినిమా థియేటర్లలో విడుదల కాకముందే డిజిటల్ రైట్స్ (OTT), శాటిలైట్ రైట్స్ (టీవీ ఛానెళ్లు), మ్యూజిక్ హక్కులను భారీ ధరలకు అమ్ముతారు. ‘పెద్ది’ వంటి క్రేజీ పాన్-ఇండియా సినిమాకు ఈ రూపంలోనే సుమారు రూ. 130 కోట్ల పైగా ముందే రికవరీ అయినట్టు రిపోర్ట్. థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే… నాన్-థియేట్రికల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మినహాయించి, మిగిలిన మొత్తాన్ని అండ్ లాభాలను రాబట్టడానికి సినిమాను వివిధ ఏరియాల డిస్ట్రిబ్యూటర్లకు అంటే నైజాం, సీడెడ్, ఆంధ్రా, ఓవర్సీస్ వారిగా ఫిల్మ్ రైట్స్‌ను అమ్ముతారు. బ్రేక్ ఈవెన్ మార్క్‌ను ఎలా డిసైడ్ చేస్తారంటే.. డిస్ట్రిబ్యూటర్లు సినిమాను థియేటర్లలో ప్రదర్శించడానికి ఎంత మొత్తం పెట్టి హక్కులను కొనుగోలు చేశారో, ఆ మొత్తాన్నే ‘థియేట్రికల్ బిజినెస్ వాల్యూ’ అంటారు. ఆయా ఏరియా వైజ్ బిజినెస్ మొత్తాన్ని కలిపితే వచ్చేదే బాక్సాఫీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్.పెద్ది’ సినిమా ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులు రూ. 218 కోట్లకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే రూ. 220 కోట్ల కలెక్షన్ల షేర్ మార్క్‌ను దాటాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాత సేఫ్‌ జోన్… బాక్సాఫీస్ స్టేటస్‌ ను బట్టి… అసలు ఓ సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది చెప్తారు. సినిమాపై మంచి అంచనాలున్నా.. జనాల్లో ఓ సినిమాపై ఇంట్రెస్ట్ ఉన్నా కూడా… థియేట్రికల్ .. నాన్ థియేట్రికల్ హక్కుల అమ్మాకాల ద్వారా.. విడుదలకు ముందే ప్రొడ్యూసర్ పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేస్తుంది. అయితే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఉండాలంటే, థియేటర్లలో టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ‘షేర్ కలెక్షన్లు’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటాలి. అలా దాటితేనే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ‘హిట్’ గా ప్రకటించబడుతుంది. సరిగ్గా ఈ వ్యాపార సమీకరణాల వల్లే పెద్ది బడ్జెట్ రూ. 350 కోట్లు ఉన్నప్పటికీ, థియేట్రికల్ రన్ పరంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 220 – 225 కోట్లుగా ఉంది. అంటే థియేటర్ల ద్వారా వచ్చే ‘షేర్ కలెక్షన్లు’ ఈ రూ. 220 కోట్ల మార్క్‌ను దాటితేనే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వస్తారని గమనించాలి. ఇక ఫైనల్‌గా పెద్ది గాడి రిజెల్ట్ చెప్పాలంటే… 9 రోజుల్లో 366 కోట్ల మైలురాయితో పెద్ది మూవీ తన బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన రూ. 220 కోట్ల షేర్ మార్క్‌కు చాలా దగ్గర్లో ఉంది. ఈ వీకెండ్ కలెక్షన్స్‌తో బ్రేక్‌ ఈవెన్‌ను అందుకునేలా ఉంది. ఆ తర్వాత టికెట్ రేట్స్ తగ్గుతాయనే విషయాని పక్కకు పెట్టి… పెద్దికి వస్తున్న రెస్పాన్స్ ఇంకొన్ని రోజులు కంటిన్యూ అయితే… పెద్ది గాడు అందరికీ లాభాల పంట పడించినట్టే… ఇంకో మాటలో చెప్పాలంటే.. పెద్దిగాడు సూపర్ డూపర్ హిట్ కొట్టినట్టే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ

ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..

పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్‌ వల్ల బతికాను..

వేద విద్యార్ధి ఆవేదన.. రూ.8 వేల కోసం..

మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన

Follow Us