వేధింపులు తట్టుకోలేను.. విషమిస్తే నేనే చచ్చిపోతా
రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న నటి పవిత్రా గౌడ బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా జైలులో తనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నైజీరియన్ మహిళా ఖైదీలు వేధిస్తున్నారని ఆరోపించారు. భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆమెను మరో సెల్‌కు తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఓ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో జైలులో ఉన్న నటి పవిత్రా గౌడకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆమె ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ బెంగళూరు కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణలో పవిత్రా గౌడ తన బాధను న్యాయస్థానానికి వివరించింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జైలులో తనను నైజీరియన్ మహిళా ఖైదీలు వేధిస్తున్నారని మరో పిటిషన్ దాఖలు చేసింది పవిత్ర. తనకు బెయిల్ ఇవ్వాలని.. లేనిపక్షంలో చనిపోయేందుకు విషమైన ఇప్పించాలని పిటిషన్‌లో రాసుకొచ్చింది. పవిత్రను హత్య చేసేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయంటూ ఆమె తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. అయితే ఇప్పటికే ఆమె మరో బ్యారక్‌కు తరలించామని సిట్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి.. తదుపరి విచారణను వాయిదా వేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జానీ మాస్టర్ వైఫ్‌కు.. దిమ్మతిరిగే షాక్
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
ఐఫోన్‌కు స్క్రీన్ ప్రొటెక్టర్ అక్కర్లేదు!ఎందుకంటే..
పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చేవారికి కేంద్రం హెచ్చరిక!
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు.. శంకర్ సక్సెస్ సీక్రెట్ ఇదే!