ప్రభాస్‌, నానిని ఇబ్బంది పెడుతున్న డెడ్‌లైన్ ఇష్యూ.. టార్గెట్ రీచ్ అవుతారా

Edited By:

Updated on: Jul 11, 2026 | 3:46 PM

ఓటీటీ ఒప్పందాలు, డిజిటల్ రైట్స్ కారణంగా టాలీవుడ్‌లో సినిమాల నిర్మాణ వేగం పెరిగింది. అయితే విడుదల ఆలస్యమైతే భారీ ఆర్థిక నష్టాలు తప్పవని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. నాని ‘ది ప్యారడైజ్’, ప్రభాస్ ‘ఫౌజీ’ వంటి పాన్ ఇండియా చిత్రాలను నిర్ణీత గడువులో పూర్తి చేసి విడుదల చేసేందుకు చిత్రబృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అన్ని సినిమాల ప్రొడక్షన్‌లో మేకర్స్ స్పీడ్ పెంచారు. దీంతో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న విషయంలో పక్కా క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఓటీటీ డీల్స్, బడ్జెట్ టార్గెట్స్ కారణంగా సినిమాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇలా స్పీడ్‌గా సినిమాలు పూర్తయితే సరే.. ఏ మాత్రం డిలే జరిగినా ఆ ఓటీటీ కోతల నష్టాలు ఊహకందని స్థాయిలో ఉంటున్నాయి. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్ మూవీ టీమ్‌ మీద చాలా ప్రెజర్‌ ఉందన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి మార్చిలోనే రావాల్సిన ఈ సినిమా డిలే కావడంతో.. ఇప్పుడు ఆగస్టు 21న పక్కాగా రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఓటీటీ సంస్థతో కుదిరిన డీల్ ప్రకారం సినిమా మళ్లీ వాయిదా పడితే అగ్రిమెంట్ కండిషన్స్‌ మారే అవకాశం ఉంది. ముందు ఒప్పుకున్న మొత్తంలో డిజిటల్ టీమ్స్‌ కోత పెట్టే ఛాన్స్ ఉంది. నాని సినిమా విషయంలోనే కాదు, ప్రభాస్‌ ఫౌజీ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా ప్రొడక్షన్ వర్క్‌ స్పీడప్ చేశారు మేకర్స్‌. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను డిసెంబర్ టార్గెట్‌గా ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండానే షూటింగ్ శరవేగంగా పూర్తి చేసేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఆన్‌ టైమ్‌ రిలీజ్ అయ్యేలా ప్రొడక్షన్ టీమ్ డే అండ్ నైట్‌ యాక్టివ్ మోడ్‌లో వర్క్ చేస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాల ప్రొడక్షన్ విషయంలో టెన్షన్‌ కనిపిస్తోంది. టైమ్‌కి సినిమాలు రిలీజ్ అయితే పర్లేదు, డిలే అయితే మాత్రం ఓటీటీ సంస్థల అగ్రిమెంట్ల మార్పులతో భారీ కోతలు తప్పవు. అందుకే ముందే కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ అనుకున్న టైమ్‌కు రిలీజ్ చేసేందుకు మేకర్స్ కష్టపడుతున్నారు. మరి ఈ సినిమాలు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాయా..? ఆన్‌ టైమ్ సినిమాలు రిలీజ్ అవుతాయా? వెయిట్ అండ్ సీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏంటి? పవన్‌ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?

V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం

Naga Durga: బిగ్ బాస్‌ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్

Naga Vamsi: బుక్‌మైషో బండారం బయటపెట్టిన నాగ వంశీ..

బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

Follow Us