Akshay Kumar: స్టార్ హీరో కూతురికి వేధింపులు..
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కూతురు నిటారా భాటియాకు ఆన్‌లైన్ వీడియో గేమ్‌లో ఎదురైన సైబర్ వేధింపులు సంచలనం సృష్టించాయి. నిందితుడు అసభ్యకర మెసేజ్‌లు పంపగా, అక్షయ్ కుమార్ దీనిని మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని అరెస్ట్ చేశారు. పిల్లల ఆన్‌లైన్ భద్రతపై ఇది ఒక హెచ్చరిక, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు ఎదురుకావడం ఇప్పుడు బీ టౌన్‌లో సంచలనంగా మారింది. అక్షయ్ కుమార్‌కు 13 ఏళ్ల కుమార్తె ఉంది. ఆమె పేరు నిటారా భాటియా. రీసెంట్‌గా నిటారా వీడియో గేమ్ ఆడుతున్నప్పుడు ఓ వ్యక్తి తన కూతురికి అసభ్యంగా మెసేజ్ పెట్టాడని అక్షయ్ మీడియా ముందర రివీల్ చేశాడు. పిల్లల చేతిలో మొబైల్ ఉండటం వల్ల ఒక్కోసారి వారు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకోవాల్సి ఉంటుందని తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన అక్షయ్.. ఈ క్రమంలోనే తన కూతురికి ఎదురైన ఓ చేదు సంఘటనను అందరితో పంచుకున్నాడు. తన కుమార్తె ఆన్‌లైన్ వీడియో గేమ్ ఆడుతున్న సమయంలో అవతలి వ్యక్తి నుంచి ఒక మెసేజ్ వచ్చిందని.. మొదట మంచివాడిగానే తన కూతురితో పరిచయం పెంచుకున్నా ఆ వ్యక్తి… చాలా బాగా ఆడుతున్నావ్ అంటూనే తన కూతురు మేలో.. ఫీమేలో తననే అడిగి తెలుసుకున్నాడన్నాడు. జెండర్ చెప్పగానే..ఆ వ్యక్తి తన కూతురికి ఇంకో మెసేజ్ పెట్టాడని.. నీ నగ్న చిత్రాలను నాకు పంపగలవా..? అంటూ బెదిరించేలా మెసేజ్ పెట్టాడని అక్ష య్ చెప్పుకొచ్చాడు. అయితే ఆ సమయంలో వెంటనే తన కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, ధైర్యంగా తన భార్యతో చెప్పిందని.. గుర్తుచేసుకున్నాడు అక్షయ్. అయితే అక్షయ్ చెప్పిన ఈ ఇన్‌సిడెంట్‌ను సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు… విచారణ జరిపి.. ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టుకు హాజరుపరుస్తామని అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: ‘వారణాసి’ స్పెషల్ వీడియో.. ఫ్యాన్స్‌కు నిరాశ
వివాదంలో అనుష్క శర్మ.. చేతులతో అసభ్యకరమైన సైగలు.. ఫ్యాన్స్ ఆగ్రహం
