చరణ్ Vs తారక్.. రచ్చ మొదలైందిగా..!
ఎన్టీఆర్ డ్రాగన్ టీజర్, రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ విడుదలైన తర్వాత అభిమానుల మధ్య పోటీ మొదలైంది. రెండు విభిన్న జోనర్స్ అయినప్పటికీ, హీరోల మేకోవర్‌లు నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. తారక్, చరణ్ ప్రాణం పెట్టి నటించగా, సోషల్ మీడియాలో తమ హీరోనే గొప్ప అంటూ చర్చ జరుగుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాల ఫలితాలు ఆసక్తిగా మారాయి.
ఎన్టీఆర్ డ్రాగన్ టీజర్, రామ్ చరణ్ పెద్ది ట్రైలర్ విడుదలైన తర్వాత టాలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది. రెండు విభిన్న జోనర్స్ అయినప్పటికీ, రెండు పెద్ద సినిమాల టీజర్, ట్రైలర్ ఒకేసారి వచ్చినప్పుడు పోలికలు సహజం. అభిమానులు తమ హీరోనే గొప్ప అని చెప్పుకుంటూ సైలెంట్ వార్‌కు తెరలేపారు. తాజాగా రెండు రోజుల వ్యవధిలో విడుదలైన ఈ గ్లింప్స్‌లలో హీరోల మేకోవర్‌లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. డ్రాగన్ కోసం తారక్ చేసిన మేకోవర్ పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయన కష్టాన్ని గుర్తించి, గ్లిమ్స్ హాలీవుడ్ స్థాయిలో ఉందని ప్రశంసిస్తున్నారు. మరోవైపు, పెద్ది కోసం చరణ్ కూడా క్రికెటర్, రెజలర్, రన్నర్ వంటి పాత్రలకు తగ్గట్లు ఒళ్లు హూణం చేసుకున్నారు. సోషల్ మీడియాలో తారక్, చరణ్ ఫ్యాన్స్ మధ్య డిబేట్ నడుస్తోంది. రెండు సినిమాల్లో ఏది బెస్ట్, ఎవరి మేకోవర్ ఎలా ఉందనే చర్చలు లోతుగా జరుగుతున్నాయి. పెద్ది స్పోర్ట్స్ డ్రామా కాగా, డ్రాగన్ ఇంటర్నేషనల్ మాఫియా నేపథ్యంలో నడుస్తుంది.
మరిన్ని వీడియో కోసం :
న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!
