ముంబై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చిన నిధి అగర్వాల్

Updated on: Oct 12, 2026 | 2:25 PM

నటి నిధి అగర్వాల్ ముంబై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో ఆమె సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న నిధి, తన కుటుంబ నేపథ్యం, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కెరీర్ పరంగా ముంబైలో ఉన్నప్పటికీ, తాను బై బర్త్ పక్కా తెలుగు అమ్మాయిని, హైదరాబాదీని అని నిధి స్పష్టం చేశారు. హైదరాబాద్ సంస్కృతి, పండుగలంటే తనకు చాలా ఇష్టమని, ఈసారి బతుకమ్మ వేడుకల్లో స్వయంగా పాల్గొంటానని తెలిపారు. అంతేకాకుండా, తెలుగు అబ్బాయిలంటే తనకు ఎంతో ఇష్టమని తన మనసులోని మాటను బయటపెట్టారు. మరి తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు, “అది ఇప్పుడే చెప్పలేం, మేబీ చేసుకోవచ్చు” అని బదులిచ్చి తెలుగు అబ్బాయిల్లో ఆశలు రేపారు. ది రాజా సాబ్ నిరాశపరచడంతో కొంత విరామం తీసుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం మిరాయ్ పార్ట్ టూతో పాటు హిందీలో ది ఇన్ఫ్లుయన్సర్ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. వెండితెరపై పెద్దగా జోరు చూపించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం నిధికి మంచి ఫాలోయింగ్ ఉంది. గ్లామరస్ నటి నిధి అగర్వాల్ ముంబై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చారు. తానొక పక్కా హైదరాబాదీ అని, తెలుగు అబ్బాయిలంటే ఇష్టమని తెలిపారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటానని చెబుతూనే, తెలుగు అబ్బాయినే పెళ్లి చేసుకునే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ప్రస్తుతం మిరాయ్ పార్ట్ టూ, ది ఇన్ఫ్లుయన్సర్ చిత్రాల్లో నటిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?

నిన్న నాని.. నేడు విజయ్.. ఇది సీరియస్ మ్యాటర్..!

టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న మమితా బైజు

రజినీకాంత్ ట్రిపుల్ ధమాకా.. అంత తొందరేంటో..?

హిట్ కొట్టాలంటే డీ గ్లామర్ తప్ప మరో దారిలేదా..?

Loading...
Unable to load recommendations.
Follow Us