Nenu Ready: త్రినాథరావు మార్క్ కామెడీతో వస్తున్న నేను రెడీ
"నేను రెడీ" సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రమోషన్స్ కిక్ స్టార్ట్ చేసింది. దర్శకుడు త్రినాథరావు నక్కిన, హీరో హవీష్ కాంబినేషన్‌లో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రూపొందింది. సమ్మర్‌లో విడుదల కానున్న ఈ చిత్రంపై మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ, కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈ సమ్మర్‌లో చాలా సినిమాలు వస్తున్నాయి.. అందులో మాది కూడా ఉందంటూ రేసులోకి వచ్చేసింది నేను రెడీ. హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూట్ పూర్తైంది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా కిక్ స్టార్ట్ చేసారు మేకర్స్. ఆ డీటైల్స్ ఈ స్టోరీలో చూద్దాం.. సినిమా చూపిస్తా మావా, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే, ధమాకా లాంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న త్రినాథరావు నక్కిన.. నేను రెడీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుంది ఈ సినిమా. హవీష్ హీరోగా వస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తైంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు మేకర్స్. హార్నిక్స్ ఇండియా LLP పతాకంపై నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో భారీ క్యాస్టింగ్ ఉంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ఔట్ పుట్‌పై యూనిట్ సంతృప్తికరంగా ఉంది. సమ్మర్‌లో కుటుంబమంతా హాయిగా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందంటున్నారు త్రినాథరావు. జీనియస్, రామ్ లీలా, సెవెన్ లాంటి సినిమాల తర్వాత హవీష్ నుంచి వస్తున్న సినిమా ఇది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కుర్ర హీరోలను రెమ్యునరేషన్లో.. దాటేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు
Drishyam 3: ‘దృశ్యం 3’కి వెంకీ నో చెప్పారా.. కారణం అదేనా
Indian 3: ఇండియన్ 3… శంకర్‌కి క్లారిటీ వచ్చిందా ??
Dhurandhar 2: తెలుగు ధురంధర్2 లో పాటలు ఉండవా.. ఇదేం మ్యాజిక్