నారి నారి నడుమ మురారి.. ప్రొడ్యూసర్ గట్టెక్కాడు, హీరో పిచ్చెక్కించాడు!
ఇటు శర్వా.. అటు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర..! ఈ ఇద్దరూ.. కలిసి చేసిన సినిమానే 'నారీ నారీ నడుమ మురారి'. లిమిటెడ్ అంచనాలతో.. సంక్రాంతి బరిలో దిగిన ఈసినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో చూద్దాం.ఇన్‌షార్ట్‌గా 'నారి నారి నడుమ మురారి' కథ గురించి చెప్పాలంటే.. ఆర్కిటెక్ట్ గౌతమ్ అలియాస్ శర్వానంద్.. నిత్య అలియాస్ సాక్షి వైద్యతో ప్రేమలో ఉంటాడు.
తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో..హీరో తండ్రి కార్తిక్ అలియాస్ నరేశ్‌కి లేటు వయసులో ప్రేమించిన యువతి పల్లవి అలియాస్ సిరి హనుమంతుతో పెళ్లి జరిపిస్తాడు. ఆ తర్వాత తన ప్రియురాలు నిత్యని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. నిత్య తండ్రి రామలింగయ్య అలియాస్ సంపత్ రాజ్‌తొలుత ఈ పెళ్లికి ఒప్పుకోడు. కానీ కూతురు బాధ చూడలేక చివరకు ఒప్పుకుంటాడు. అయితే రిజిస్టర్ ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకోవాలని షరతు విధిస్తాడు. తప్పనిసరి పరిస్థితుల్లో గౌతమ్ ఈ రిజిస్టర్ పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి దరఖాస్తు కోసం రిజిస్టర్ ఆఫీసుకి వెళ్లగా.. గౌతమ్‌కి అనుకొని సమస్య ఎదురవుతుంది? ఆ సమస్యేంటి? మధ్యలో తన ఎక్స్ లవర్ దియా అలియాస్ సంయుక్త గౌతమ్‌కి వచ్చిన ప్రాబ్లం ఏంటి? అసలు గౌతమ్-నిత్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం :
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
కర్మకాండకు రెడీ చేస్తుండగా.. బతికే ఉన్నానంటూ ఫోన్!
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
