NTR సినిమాపై నారా రోహిత్ కుట్ర.. క్లారిటీ

Updated on: Aug 25, 2025 | 7:46 PM

కొన్ని రోజుల ముందు.. ఎన్టీఆర్ వార్ 2 సినిమాపై నారా రోహిత్ కొన్ని అభ్యంతరకరమైన కామెంట్స్ చేశారనేలా ఓ ఆడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తాను కూలీ సినిమా చూశానని.. బాగుందని.. కానీ వార్ 2 సినిమా చూడనని.. చూసే ఉద్దేశ్యం కూడా తనకు లేదని.. చూడమని కూడా ఎవ్వరికీ చెప్పనని రోహిత్ మాట్లాడినట్లుగా ఉన్న ఈ ఆడియో కారణంగా నందమూరి ఫ్యాన్స్ మధ్య కాస్త అపోహలు వచ్చాయనే కామెంట్స్ కూడా వినిపించాయి.

అయితే.. తాజాగా ఆ ఆడియో ఫేక్ అనే విషయం తేలిపోయింది. స్వయంగా నారా రోహిత్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆగస్ట్ 27న రిలీజ్ అవుతున్న తన సుందరాకాండ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నారా రోహిత్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెట్టింట వైరల్ అయిన వార్ 2 ఆడియో గురించి మాట్లాడాడు. ఆ ఆడియోను తాను వినలేదని చెప్పిన రోహిత్.. దాని గురించి స్పందించాలనే అనుకోవటం లేదని తేల్చి చెప్పాడు. అంతేకాదు ఎన్టీఆర్‌ తనకు మంచి ఫ్రెండ్‌ అని.. తనతో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నట్టు కూడా రోహిత్ చెప్పాడు. మంచి కథ దొరికితే తప్పకుండా యంగ్ టైగర్‌తో నటిస్తానని రోహిత్ చెప్పాడు. దీంతో నారా రోహిత్ మాట్లాడినట్లుగా వచ్చిన ఆడియో పక్కా ఫేక్ అని తేలిపోయింది. దానితో బాటే.. సోషల్ మీడియాలో ఇన్నిరోజులుగా రేగిన రచ్చ కూడా సమసిపోయింది. ప్రస్తుతం నారా రోహిత్ చెప్పిన మాటలూ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సినిమాలు మానేసి.. జాతకాలు చెప్పుకుంటున్న హీరోయిన్

ఓవర్ యాక్షన్ ఎఫెక్ట్.. బిగ్‌బాస్‌కు రాకుండా గెంటేసిన జడ్డెస్

దేవుడి సినిమా దెబ్బకి చిత్తవుతున్న వార్ 2, కూలీ

ఆ సీన్‌లో లాజిక్కేది ?? వార్ 2పై RGV షాకింగ్ రివ్యూ

ఈ వయసులోనూ.. జిమ్‌లో తగ్గేదేలే అంటోన్న మెగాస్టార్..!