The Paradise Collection: దిమ్మతిరిగే కలెక్షన్స్.. నాని కెరీర్‌లో ఫాస్టెస్ట్ రూ.100CR!

Updated on: Sep 27, 2026 | 12:41 PM

నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్‌’ బాక్సాఫీస్‌ వద్ద వేగంగా దూసుకెళ్తోంది. రెండో రోజుకే రూ.100 కోట్ల మార్క్‌ దాటినట్లు మేకర్స్‌, ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.114 కోట్లకు పైగా గ్రాస్‌ వచ్చిందని సమాచారం. నాని కెరీర్‌లోనే అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్‌లోకి చేరిన సినిమాగా రికార్డు సృష్టించినట్లు కథనం పేర్కొంది. నార్త్‌ అమెరికాలోనూ 1.7 మిలియన్‌ డాలర్ల మార్క్‌ దాటినట్లు ట్రేడ్‌ రిపోర్టులు చెబుతున్నాయి.

నాని సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రీమియర్స్ తో కలిపి డే1 88 కోట్ల బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను రాబట్టిన నాని.. ఇప్పుడు డే2 ఏకంగా వంద కోట్లను దాటేసి.. తన కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ 100 క్రోర్ ను సాధించిన సినిమాగా రికార్డ్‌ క్రియేట్ చేశాడు. న్యాచురల్ స్టార్ నాని నటించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఒదెల డైరెక్టర్. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును దాటేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.114 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా భాషల్లోనూ ‘ది ప్యారడైజ్’ జోరు చూపిస్తోంది. తమిళ, కన్నడ మార్కెట్లతో పాటు హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో థియేట్రికల్ రన్ చాలా స్ట్రాంగ్‌గా సాగుతోంది. ఇక ఓవర్సీస్‌లో అయితే ఈ సినిమా ఇంకో లెవెల్‌లో ఇంపాక్ట్ చూపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రాని విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ 1.7 మిలియన్ డాలర్ల గ్రాస్ మార్కును దాటేసిన ఈ చిత్రం, చాలా వేగంగా 2 మిలియన్ డాలర్ల మార్కు వైపు దూసుకెళ్తోంది. మూడో రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా ఆశాజనకంగా ఉండటంతో, రాబోయే వీకెండ్‌లో ఈ సినిమా మరిన్ని పాత రికార్డులను తిరగరాయనుందని టీమ్ బలంగా నమ్ముతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Avengers Endgame Encore: ఎండ్‌గేమ్ ఎన్‌కోర్ దెబ్బకు.. మన బాహుబలి రికార్డ్‌ గల్లంతు!

వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇక టోల్ కోసం ఆగాల్సిన పనే లేదు!

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న కరెంట్‌ బిల్లు ఛార్జీలు

పాలకూట విషం.. సూదిమందులతో ప్రజలు, పశువుల ప్రాణాలతో చెలగాటం!

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారికి కేంద్రం కొత్త నిబంధనలు

Loading...
Unable to load recommendations.
Follow Us