హీరో నాని రిక్వెస్ట్.. సీఎం రేవంత్ రిప్లై! థియేటర్ విజిట్ రద్దు చేసుకున్న నాని!
‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను అభిమానులతో కలిసి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో చూడాలన్న నాని కోరికకు భద్రతా కారణాలతో బ్రేక్ పడింది. సీఎం రేవంత్ రెడ్డి నాని విజ్ఞప్తిపై స్పందిస్తూ, పోలీసుల సూచనలను పాటించాలని, అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో నాని థియేటర్ విజిట్‌ను విరమించుకున్నట్లు తాజా సమాచారం. మరోవైపు సెప్టెంబర్ 23న తెలంగాణలో స్పెషల్ షోలకు అనుమతి లభించగా, సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది.
నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్‌కు ముందు.. నాని చేసిన ఓ ప్రత్యేక విజ్ఞప్తి, దానిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ థియేటర్‌లో అభిమానులతో కలిసి చూడాలని నాని కోరుకున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు తెలంగాణ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.చిన్నప్పటి నుంచి సినిమాలను ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో చూడటం తనకు ఎంతో ఇష్టమని, హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు ప్రత్యేకమైన సినిమా అనుభూతి ఉందని నాని తన సందేశంలో పేర్కొన్నారు. థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చొని వారి స్పందనను ప్రత్యక్షంగా చూడటంలోనే అసలైన సంతృప్తి ఉంటుందని నాని తెలిపారు. అయితే తన పర్యటన సందర్భంగా అమల్లో ఉన్న అన్ని భద్రతా నిబంధనలు, అవసరమైన మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు. ప్రజల భద్రతకే తమ తొలి ప్రాధాన్యం ఉంటుందని చెబుతూ, తన విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. నాని చేసిన ఈ విజ్ఞప్తిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతా మార్గదర్శకాలను గౌరవిస్తున్నందుకు నానికి అభినందనలు తెలిపారు. తెలంగాణకు చెందిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమాపై నానికి ఉన్న తపనను కూడా సీఎం ప్రశంసించారు. అయితే.. ప్రీమియర్ షోకు నేరుగా అనుమతి ఇచ్చినట్టు సీఎం ప్రకటించలేదు. అభిమానుల తాకిడి, వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్దేశిత పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దరఖాస్తు చేసుకోవాలని నానికి సూచించారు. ఆ దరఖాస్తును పరిశీలించిన తర్వాత పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. నాని వినతిని పరిశీలించి, తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని కూడా సీఎం ఆదేశించారు. అయితే.. ఈ వ్యవహారంలో ఇప్పుడు మరో కీలక అప్‌డేట్ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ సూచనలను గౌరవిస్తూ.. అభిమానులతో కలిసి థియేటర్‌లో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ చూసే తన నిర్ణయాన్ని నాని రద్దు చేసుకున్నారు.అంటే.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని థియేటర్‌కు వెళ్లి అభిమానులతో కలిసి సినిమా చూడాలన్న నాని కోరికకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్టే. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. జనసమూహ నియంత్రణ, ట్రాఫిక్, ప్రజల భద్రత వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వాటిని గౌరవిస్తూ నాని తన థియేటర్ విజిట్‌ను రద్దు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక.. ఈ పరిణామంతో ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌కు నాని అభిమానుల మధ్యే హాజరవుతారా అనే ఆసక్తికి కూడా తెరపడింది. ఇక ‘ది ప్యారడైజ్’ విషయానికి వస్తే.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. కయాదు లోహార్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు, రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, సోనాలి కులకర్ణి, బాబు మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాలో హింస, రక్తపాతం ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డ్ ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. దాదాపు 2 గంటల 49 నిమిషాల నిడివితో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 24న విడుదల కానున్న ఈ సినిమాకు.. అంతకంటే ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 23న ప్రీమియర్ షోలకు తెలంగాణలో అనుమతి లభించింది. అయితే నాని మాత్రం అభిమానులతో కలిసి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో సినిమా చూడాలన్న తన ప్రత్యేక కోరికను భద్రతా కారణాల నేపథ్యంలో విరమించుకున్నారు. మొత్తానికి.. ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్‌ను అభిమానులతో కలిసి థియేటర్‌లో చూడాలని నాని చేసిన రిక్వెస్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పోలీసుల సూచనలను పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో సీఎం, డీజీపీ సూచనను గౌరవిస్తూ నాని తన థియేటర్ విజిట్‌ను రద్దు చేసుకున్నారు. అభిమానులతో కలిసి సినిమా చూడాలన్న నాని కోరిక నెరవేరకపోయినా.. ‘ది ప్యారడైజ్’పై మాత్రం అంచనాలు భారీగా కొనసాగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దడ పుట్టిస్తున్న వాయుగుండం.. తీరంలో రాకాసి అలల బీభత్సం.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
గుడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్‌పై వారికి రూ.600 తగ్గింపు!
