నాగార్జున.. నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది.. ఐలవ్యూ చెప్పాడు..
టాలీవుడ్‌లో 40 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాగార్జునకు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘గీతాంజలి’ సినిమాలో షూటింగ్ సమయంలో నాగ్ తన ముఖంపై సిగరెట్ పొగ వదిలి ‘ఐ లవ్యూ’ చెప్పాడని లెజెండరీ నటి షావుకారు జానకి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సన్నివేశం, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సుమారు 40 ఏళ్లు అవుతోంది. ఆయన హీరోగా పరిచయమైన సినిమా 1986 మే 23న విడుదలైంది. ఈ 40 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు నాగ్. రొమాంటిక్, యాక్షన్, భక్తిరస సినిమాలు చేసి టాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం నాగ్ వయసు 66 ఏళ్లు. అయినా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్, గ్లామర్ విషయంలో.. ఏమాత్రం తగ్గడంలేదీ సీనియర్ హీరో. ఇప్పటికే తన సినిమా కెరీర్ లో ఎన్నో మైలురాళ్లను అందుకున్న నాగ్ ఇప్పుడు తన 100వ సినిమాతో బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు రా.కార్తీక్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ‘కింగ్ 100’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున మరింత స్టైలిష్ గా కనిపిస్తారని సమాచారం. అయితే కింగ్ నాగార్జున కెరీర్ ప్రారంభంలో ఓ స్టార్ హీరోయిన్ ముఖంపై సిగరెట్ పొగ ఊది మరీ.. ఐలవ్యూ చెప్పాడట. ఆ మధ్యన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా ఆ నటినే ఈ విషయాన్ని బయటపెట్టారు. ఆమె మరెవరో కాదు లెజెండరీ నటి షావుకారు జానకి. నాగార్జున కెరీర్ బిగినింగ్ లో నటించిన సూపర్ హిట్ సినిమాల్లో గీతాంజలి ఒకటి. మణిరత్నం తెరకెక్కించిన ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీలో గిరిజ హీరోయిన్ గా నటించింది. అలాగే సీనియర్ నటి షావుకారు జానకి కూడా ఓ కీలక పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమాలో భాగంగా గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటాడు నాగార్జున. ఆ మెడల్ ను అందించే పాత్రలో జానకి కనిపించారు. అయితే సరిగ్గా అదే టైమ్ లో నాగార్జున సిగరెట్ తాగి స్టేజ్ మీదకు వస్తాడు. అప్పుడు ఆ పొగ నోటిలో ఉంటుంది. దాన్ని ఎటు వదలాలో తెలియక..చివరికి జానకి ముఖం మీదకు వదిలేస్తాడు. అంతే ఆమె షాక్ అవుతారు. ఆమె తేరుకునే లోపే ఐలవ్యూ చెప్పి కిందకు వెళ్లిపోతాడు. ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి అడిగినప్పుడు షావుకారు జానకి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. గీతాంజలి సినిమా, నాగార్జున నటనపై ప్రశంసలు కురిపించారు. అయితే ప్రస్తుతం ఈ సీన్… షావుకారు జానకి మాటలు రెండూ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. క్రేజీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన గుత్తా జ్వాల.. వేల మంది చిన్నారులకు అమ్మగా మారిన స్టార్
