Prabhas, Rajamouli Video: బాహుబలి రిపీట్… ప్రభాస్‌, రాజమౌళి కాంబోలో మరో సినిమా.. (వీడియో)

|

Sep 21, 2021 | 9:21 PM

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో డార్లింగ్ పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయారు..అంతేకాదు.. బాహుబలి సినిమాలో ప్రభాస్ నటనకు.. జక్కన తెరకెక్కించిన తీరుకు దేశవ్యాప్తంగానే కాకుండా..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో డార్లింగ్ పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయారు..అంతేకాదు.. బాహుబలి సినిమాలో ప్రభాస్ నటనకు.. జక్కన తెరకెక్కించిన తీరుకు దేశవ్యాప్తంగానే కాకుండా.. విదేశాల్లో కూడా వీరికి అభిమానులు పెరిగిపోయారు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చత్రపతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక అత్యంత భారీ బడ్జెట్‏తో తెరకెక్కించిన బాహుబలి కూడా థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ తర్వాత మరోసారి వీరిద్దరి కలయికలో సినిమా రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి.. ప్రభాస్ కలయికలో మరో సినిమా రాబోతుందని ఇండస్ట్రీలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

దర్శధీరుడు రాజమౌళి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఇందుకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక గతవారం క్రితం మైత్రీ మూవీ మేకర్స్.. డైరెక్టర్ రాజమౌళిని కలిశారట. దీంతో మరోసారి బాహుబలి కాంబో రిపీట్ కాబోతుందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రాజమౌళి, ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
మరిన్ని చదవండి ఇక్కడ : Ek Number News Live Video: చచ్చిపోయిన రోజే మళ్ళా పుట్టిన కవలలు | కండ్ల నీళ్లు పెట్టుకున్న సోనూసూద్‌.(వీడియో)

 Big News Big Debate Live Video: వైట్‌ ఛాలెంజ్‌లు.. రాజకీయ మంటలు… (లైవ్ వీడియో)

 Singer Mangli Interview Full Video: శేఖర్ సార్ చాలా కూల్.. నచ్చాడు.. సింగర్ మంగ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..(వీడియో)

 రేవంత్ ఇంటి దగ్గర హై టెన్షన్.. భగ్గుమన్న తెలంగాణ రాజకీయాలు.. (లైవ్ వీడియో): High Tenction at Revanth Reddy House Video.

Follow us on