Drishyam 3: దృశ్యం3 వాయిదా.. అసలు కారణమేంటి ??
మోహన్‌లాల్ దృశ్యం 3 విడుదల వాయిదా పడింది. ఏప్రిల్ 2న రావాల్సిన జార్జ్ కుట్టి ఇప్పుడు మే 21న వస్తున్నారు. కేరళ ఎన్నికలు, యుద్ధ ప్రభావం వంటి కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయిదాపై అభిమానులు కాస్త నిరాశ చెందినా, సమ్మర్‌లోనే కొత్త తేదీ ఉండటంతో ఊరట పొందుతున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దృశ్యం 3 స్టార్ట్ అయినప్పటి నుంచీ ఏదో ఒక ఫ్లాష్ న్యూస్‌లో ఉంటూనే ఉంది. మొన్న మొన్నటిదాకా హిందీ దృశ్యం3, మలయాళ దృశ్యం3 స్టోరీలు సేమా? కాదా? అనే డిస్కషన్ జరిగింది. తెలుగులో అసలు దృశ్యం 3 ఉంటుందా? లేదా అనే టాపిక్ క్రియేట్ అయింది. అంతకు మించి మరో విషయం స్ప్రెడ్ అవుతోంది. మలయాళంలో దృశ్యం విడుదలైనప్పుడు సరిహద్దులు దాటి భాషలకు అతీతంగా జనాలను ఆకట్టుకుంది. థ్రిల్లర్ అంటే ఇలా ఉండాలి. ఫ్యామిలీ ఎ లిమెంట్స్ ఇలాగే ఉండాలంటూ జనాలను అమితంగా ఆకట్టుకుందీ సినిమా. ఆ తర్వాత సెకండ్ పార్టుకు కూడా అంతే స్పందన వచ్చింది. మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ థర్ట్ పార్ట్ షూట్ కంప్లీట్ చేశారు. మోహన్‌లాల్ అండ్ టీమ్ కేక్ కట్ చేసి షూటింగ్ ప్యాకప్ అని అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అసలు షూటింగ్ ఎప్పుడు చేశారు? ఎలా పూర్తి చేశారు? కొనసాగింపు ఉంటుందా? అని బోలెడన్ని అనుమానాలు.. ఇదే ఫైనల్ పార్ట్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు కెప్టెన్. ఏప్రిల్ 2న దృశ్యం 3 రిలీజ్‌కి రెడీ… నెవర్ బిఫోర్ అన్న రేంజ్‌లో రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. అప్పుడు అంత ఘనంగా చెప్పిన విషయం మీద ఇప్పుడు నీళ్లు చల్లేశారు. దృశ్యం3 పోస్ట్ పోన్ అయింది. జార్జ్ కుట్టి మే 21న వస్తారంటూ ప్రకటించారు. ఏప్రిల్ 9న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. సో, వారం ముందు ప్రీ ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది. మరోవైపు వార్ ఎఫెక్ట్ కూడా కలెక్షన్ల మీద పడే ప్రభావం ఉంది. అందుకే ఈ టైమ్‌లో సినిమాను రిలీజ్ చేయాలా? వద్దా? అనే ఆలోచనలో పడి, ఫైనల్ గా పోస్ట్ పోన్ చేయడమే కరెక్ట్ అని భావించారట. గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. వేచి చూస్తూ ఉంటుంది అంటూ సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పారు మోహన్‌లాల్. సమ్మర్‌కి దృశ్యం3 పర్ఫెక్ట్ మూవీ. ఫ్యామిలీస్‌తో చూడదగ్గ థ్రిల్లర్ అని అనుకున్న మూవీ లవర్స్ .. సినిమా వాయిదా పడిందనితెలిసి కాసింత డీలా పడినా, నయా డేట్ కూడా సమ్మర్‌లోనే ఉండటంతో కాసింత ఊరట పొందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హిట్ వచ్చినా.. బ్రేక్ తీసుకుంటున్న డైరెక్టర్లు
Free Bus: మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేది అప్పుడే !!
ఇండస్ట్రీలో విషాదం.. యంగ్ హీరోయిన్
Gold Price Today: యుద్ధం ఎఫెక్ట్.. బంగారం,వెండి ధరలకు రెక్కలు