డార్లింగ్ హీరోకు మెగా స్టార్.. క్రేజీ బర్త్‌డే విషెస్

|

Oct 24, 2024 | 10:54 AM

రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ప్రభాస్. వర్షం, డార్లింగ్, ఛత్రపతి, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. తన నటన, మంచితనంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతే కాదు తన హాస్పటాలిటీతో.. అందర్నీ ఫిదా చేస్తుంటాడు. తన ఇంటి భోజనం అందరికీ రుచి చూపిస్తుంటారు.

అలాంటి ఈ హీరో పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, సెలబ్రెటీలు ఆయనకు విషెష్ చెబుతూ ఫోటోలు షేర్ చేస్తున్నారు. ప్రభాస్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరు కూడా… డార్లింగ్ ప్రభాస్‌ కు క్రేజీగా బర్త్‌ డే విషెష్ చెప్పారు. ఎస్! ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటున్న మెగాస్టార్ చిరు… తాజాగా ప్రభాస్‌ను విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఆ కటౌట్ చూసి అన్నీ నమ్మేయాలి డూడ్ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు అతను ప్రేమించే పద్దతి చూసి.. తిరిగి అమితంగా ప్రేమించేస్తాం… పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్. లవ్ యూ అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్. అయితే ప్రభాస్‌కు వచ్చిన బర్త్‌ డే ట్వీట్స్‌లోనూ.. మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్విటే నెట్టింట ఎక్కువ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర రోజు కష్టపడితే.. భారీగా రెస్పాన్స్ !! ‘రోలెక్స్’ సినిమాపై సూర్య అప్డేట్

Follow us on