మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ

Updated on: Mar 24, 2026 | 8:16 PM

సింగర్ మంగ్లీ తన పేరుతో జరుగుతున్న మైక్రోఫైనాన్స్ మోసాలను ఖండించారు. ఫైనాన్స్ వ్యాపారులతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రొఫెషనల్ ఈవెంట్‌ల కోసమే సంప్రదింపులుంటాయని, వ్యక్తిగత వ్యాపారాలకు తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. తన పేరుతో డబ్బులు వసూలు చేసే వారిని నమ్మవద్దని ప్రజలను కోరారు. మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీసులను అభ్యర్థించారు.

మైక్రో ఫైనాన్స్ పేరిట.. త‌న పేరుతో కొంద‌రు డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను సింగ‌ర్ మంగ్లీ ఖండించారు. ఫైనాన్స్ వ్యాపారుల‌కు త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ప్రొఫెన‌ల్ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేష‌న్ వివ‌రాల వ‌ర‌కే గాని, వాళ్ల ప‌ర్స‌న‌ల్ వ్యాపారాల గురించి త‌న‌కు, త‌న కుటుంబ స‌భ్యుల‌కు ఏ మాత్రం తెలియ‌వ‌న్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో ఓ లేఖ‌ను విడుద‌ల చేశారు. “మైక్రోఫైనాన్స్ పేరిట నా పేరుతో కొంద‌రు డ‌బ్బులు వ‌సూలు చేశార‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను ఖండిస్తున్నాను. నాకు ఆ వ్య‌క్తుల‌కు, వాళ్ల‌కు సంబంధించిన ఫైనాన్స్ వ్యాపారాల‌కు ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెష‌న‌ల్ ఈవెంట్స్ కోసం న‌న్ను, నా త‌మ్ముడిని రోజు చాలా మంది సంప్ర‌దిస్తుంటారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఇన్విటేష‌న్ వివ‌రాల వ‌ర‌కే గాని, వాళ్ల ప‌ర్స‌న‌ల్ వ్యాపారాల గురించి నాకు, నా కుటుంబ స‌భ్యుల‌కు ఏ మాత్రం సంబంధం లేని విష‌యం. ఇలాంటి మోస‌పూరిత విష‌యాల్లో నా పేరును వాడుకోవ‌డం, న‌న్ను ఇవ్వాల్వ్ చేయ‌డం చాలా అన్యాయం. కావాల‌ని కొంద‌రు నా వ్య‌క్తిగ‌త పేరు, ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్న క‌రెన్సీకి సంబంధించిన వీడియోల‌కు, మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. నా ప్రొఫెష‌న్ ఈవెంట్స్ మినహా నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. ద‌య‌చేసి నా పేరు చెప్పి ఎవ‌రైనా డ‌బ్బులు వ‌సూలు చేసినా మీరు న‌మ్మ‌వ‌ద్దు. అలా మోస‌పోయిన వారికి న్యాయం చేయాల‌ని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నాను” అంటూ మంగ్లీ ఓ నోట్‌ను రిలీజ్ చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు

Dhurandhar 2: బన్నీతో దురంధర్ డైరెక్టర్ పాన్ వరల్డ్ ఫిల్మ్

Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..

Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్

వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??

Follow Us