అర్థరాత్రి హైవేపై దారి తప్పిన స్టార్ హీరో.. గుర్తుపట్టి దారి చూపిన యువకుడు

Updated on: Aug 17, 2026 | 6:19 PM

షూటింగ్‌ ముగించుకుని కేరళకు తిరిగి వస్తున్న మమ్ముట్టికి తమిళనాడులో అర్థరాత్రి అనూహ్య సమస్య ఎదురైంది. హైవే బ్లాక్‌ కావడంతో గూగుల్‌ మ్యాప్స్‌ సైతం సరైన దారి చూపకపోవడంతో ఆయన బృందం ఇబ్బందుల్లో పడింది. ఈ సమయంలో పట్టమంగళం వద్ద పాండియన్‌ అనే యువకుడు వారికి సాయం చేశాడు. తన బైక్‌పై ముందుగా వెళ్లి సుమారు 10 కిలోమీటర్లు దారి చూపించాడు. అతని ఆప్యాయతకు మమ్ముట్టి ఫిదా అయ్యారు.

మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టికి తమిళనాడులో మరువలేని అనుభవం ఎదురైంది. షూటింగ్ ముగించుకుని అర్థరాత్రి దాటాక కేరళకు తిరిగి వస్తున్న సమయంలో దారి తప్పిన ఆయనకు, ఓ సాధారణ యువకుడు దేవుడిలా వచ్చి సహాయం చేశాడు. ఈ హృద్యమైన సంఘటనకు సంబంధించిన విషయాలను ప్రముఖ నిర్మాత ఆంటో జోసెఫ్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా, ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడులోని కారైకుడిలో తన కొత్త సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న మమ్ముట్టి, నిర్మాత ఆంటో జోసెఫ్, నటుడు రమేష్ పిషారడిలతో కలిసి కారులో కేరళకు బయలుదేరారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తిరుపత్తూరు సమీపంలో హైవే బ్లాక్ కావడంతో వారి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. గూగుల్ మ్యాప్ సహాయంతో దారి వెతికినప్పటికీ, పదేపదే అదే దారికి చేరడంతో సుమారు గంటపాటు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితి అర్థం కాక విసిగిపోయిన మమ్ముట్టి తిరిగి రూమ్‌కే వెళ్దామని అనడంతో డ్రైవర్ కారు వెనక్కి తిప్పడానికి సిద్ధమయ్యాడు. అయితే మార్గమధ్యలో పట్టమంగళం వద్ద ఒక పెట్రోల్ బంక్ కనిపించింది. డ్రైవర్ కారు ఆపి అక్కడ నిద్రిస్తున్న యువకులనుసంప్రదించాడు. అందులో ‘పాండియన్’ అనే యువకుడు కారులో కూర్చున్నది మమ్ముట్టి అని ఇట్టే గుర్తించాడు. వెంటనే ఆయన వద్దకు వచ్చి “మీరు మమ్ముట్టి సారా?” అని ఆశ్చర్యపోయి, వారి సమస్య తెలుసుకుని తాను దారి చూపుతానని చెప్పాడు. గూగుల్‌కు కూడా సరిగ్గా తెలియని దారుల్లో, తెల్లవారుజామున సుమారు 10 కిలోమీటర్ల దూరం తన బైక్‌పై వారికి ముందుండి దారి చూపించి సరైన మార్గంలో చేర్చాడు. అక్కడినుంచి ఇలాగే స్ట్రెయిట్‌గా వెళ్తే కేరళ దారి వస్తుంది అని చెప్పి వీడ్కోలు పలికాడు. పాండియన్ చూపిన ఈ ఆప్యాయతకు మురిసిపోయిన మమ్ముట్టి వెంటనే కారు దిగి ఆ యువకుడిని ఆప్యాయంగా హత్తుకున్నారు. అంతేకాదు, అతనితో సెల్ఫీ దిగి పేరు అడిగి మరీ అభినందించారు. స్టార్ హీరో అయినప్పటికీ మమ్ముట్టి చూపిన నిరాడంబరత, అర్ధరాత్రి ఆపద్బాంధవుడిగా నిలిచిన ఆ యువకుడి మంచి మనసు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దైవసాక్షిగా సాగిన స్వాతంత్ర్య పోరాటానికి.. సజీవ సాక్ష్యం ఈ గ్రామం!

రాచనాగుతో మామూలుగా ఉండదు మరి.. ఒకేరోజు రెండు కింగ్‌ కోబ్రాలు..

పసిడి ధర పైపైకి..ఇవాళ తులం గోల్డ్‌ ధర ఎంత పెరిగిందంటే!

ఇంట్లో చోరీకి వచ్చి ఆ దొంగ చేసిన పనికి.. నవ్వకుండా ఉండలేరు!

రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం

Loading...
Unable to load recommendations.
Follow Us