బాలీవుడ్‌లో హీరోయిన్లపై వివక్ష.. బడ్జెట్ కటింగ్స్‌పై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్
గ్లామర్ రోల్స్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తా చాటుతున్న కృతి సనన్, బాలీవుడ్‌లో హీరోయిన్ల వివక్షపై సంచలన వ్యాఖ్యలు చేశారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు బడ్జెట్, రెమ్యునరేషన్ విషయంలో వివక్ష కొనసాగుతుందని, మొదట హీరోయిన్ల రెమ్యునరేషన్ లోనే కోత పెడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆమె స్పష్టం చేశారు.
బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ తనదైన ముద్ర వేస్తున్న నటి కృతి సనన్, చిత్ర పరిశ్రమలో మహిళా ప్రధాన సినిమాల పరిస్థితిపై కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. బాలీవుడ్‌లో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల సినిమాలకు బడ్జెట్, రెమ్యునరేషన్ విషయంలో వివక్ష కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల విషయంలో ఎక్కువ ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు ఇప్పటికీ భయపడుతున్నారని కృతి పేర్కొన్నారు.మహిళా ప్రధాన చిత్రాలకు ప్రేక్షకులు పెద్దగా రారనే అపవాదు ఇప్పటికీ ఉందని, సినిమా బడ్జెట్ తగ్గించాల్సి వస్తే ముందుగా హీరోయిన్ల రెమ్యునరేషన్ లోనే కోత పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కంటెంట్ బలంగా ఉండి, సరైన స్థాయిలో ప్రెజెంట్ చేస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని కృతి సనన్ నొక్కిచెప్పారు. తన మిమి, అలాగే టబు, కరీనా కపూర్‌లతో కలిసి చేసిన క్రూ సినిమాల విజయం దీనికి నిదర్శనమని ఆమె గుర్తు చేశారు.
