మైఖెల్ జాక్సన్ బయోపిక్.. ట్రైలర్ వ్యూస్‌లో సరికొత్త రికార్డ్
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా ఐమ్యాక్స్ 3Dలో రానున్న బయోపిక్ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లయన్స్ గేట్-యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాఫర్ జాక్సన్, తన మామ ఎం.జే పాత్రను పోషిస్తూ అద్భుత డ్యాన్స్‌తో మెప్పించాడు. బాల్యం, మానసిక సంఘర్షణలు, అద్భుతమైన లైవ్ షోలను చూపిస్తున్న ట్రైలర్ అభిమానులను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఈ చిత్రం 1 బిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా.
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ జీవిత కథతో ఐమ్యాక్స్ 3Dలో ఓ అద్భుతం రాబోతోంది. లయన్స్ గేట్- యూనివర్శల్ పిక్చర్స్ లాంటి గ్రేట్ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు జాక్సన్ బయోపిక్ తీస్తున్నాయి. ఈ బయోపిక్ హాలీవుడ్‌లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటి. తాజాగా విడుదలైన సినిమా ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అతడి శరీరంలో అణువణువు ఒక ప్రకంపనం. ఎగసిపడే డ్యాన్సింగ్ వేవ్ అతడు. జాక్సన్ వేదికపైకి వస్తే అభిమానుల్లో పూనకాలే. అతడి డాన్స్ చూసి మైమరిచిపోయి పులకించిపోయి కంటతడి పెట్టే అభిమానులు లక్షలాదిగా ఉంటారు. లైవ్ షోలు కన్నీటి ధారలతో తడిసి ముద్దయ్యేవి. అతడంటే ఒక తరం యూత్ కి పిచ్చి. అమ్మాయిలకు డాన్సింగ్ కింగ్. ప్రపంచం మొత్తం అంత పిచ్చిగా వేరొక డాన్సర్‌ని ప్రేమించి ఉండదేమో! అతడి నరనరాన డ్యాన్స్ నిండిపోయి ఉంటుంది. ప్రతి కదలికా ఒక సెన్సేషన్. అందుకే జాక్సన్ చనిపోయి పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ప్రపంచ ఫాన్స్ హృదయాలను రారాజులా ఏలుతూనే ఉన్నాడు. జాక్సన్ స్ఫూర్తితో ప్రభు దేవా నుంచి మొదలుకుని ఎందరో కొరియోగ్రాఫర్లు అంతకంతకు ఎదుగుతూనే ఉన్నారు. యువతరం డ్యాన్స్ అనే కళను ఆరాధించడానికి ఆద్యుడు మైఖేల్ జాక్సన్. అతడి వ్యక్తిగత జీవితం వేరు.. వృత్తి జీవితం వేరు . అతడి ఫ్యామిలీ లైఫ్ ఆద్యంతం చాలా ఎమోషన్స్ తో కూడుకుంది. అతడి బాల్యంలో కష్టాలు ట్రైలర్ లో కనిపిస్తోంది. లైవ్ షోలో అతడి కోసం పడి చచ్చే అభిమాన జనాన్ని కూడా అద్భుతంగా చూపించారు. ట్రైలర్‌లో కనిపించే ఎరుపు రంగు లెదర్ జాకెట్, గ్లోవ్స్ వంటివి ఎం.జే అభిమానులను ఎమోషనల్ చేస్తున్నాయి. చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రను ఆయన అన్న కొడుకు జాఫర్ జాక్సన్ పోషిస్తున్నాడు. ట్రైలర్‌లో అతని బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ మూవ్స్ చూస్తుంటే అచ్చం ఎం.జేని చూసినట్లే ఉందని అభిమానులు ఫిదా అవుతున్నారు. `ఈక్వలైజర్` సిరీస్ ఫేమ్ ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకుడు. గ్రాహం కింగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించింది. కేవలం మ్యూజిక్ డ్యాన్స్‌కే పరిమితం కాకుండా, బాల్యం నుంచి మైఖేల్ ఎదుర్కొన్న మానసిక సంఘర్షణలు, ఒత్తిళ్లను కూడా సినిమాలో చూపించబోతున్నట్లు ట్రైలర్ చెబుతోంది. ఒరిజినల్ గా జాక్సన్ జీవితంలో ఏం జరిగిందో ఉన్నదున్నట్టు చూపిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. ట్రేడ్ అంచనాల ప్రకారం ఈ చిత్రం 1 బిలియన్ డాలర్లు అంటే 8,300 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
250 అడుగుల ఎత్తులో.. అతి పెద్ద ఆర్చ్ నిర్మాణానికి ట్రంప్ ప్లాన్
