Jr NTR చుట్టూ ఏం జరుగుతోంది?

Updated on: Jul 17, 2026 | 8:25 AM

జూనియర్ ఎన్టీఆర్ పేరుతో రా ఎన్టీఆర్ అభిమాన సంఘం నిర్వహిస్తున్న ఊరు-వాడ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. ఎన్టీఆర్ కార్యాలయం ఈ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. వసూళ్ల ఆరోపణలు, రాజకీయ అరంగేట్రం ప్రచారాన్ని ఖండిస్తూ, అధికారిక అభిమాన సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ పేరుతో రా ఎన్టీఆర్ అభిమాన సంఘం చేపట్టిన ఊరు-వాడ కార్యక్రమం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ నెల 18న తిరుపతిలో జరగనున్న ఈ ఈవెంట్ వెనుక జరుగుతున్న పరిణామాలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఫ్యాన్స్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ కు తెలియకుండా దందా జరుగుతోందన్న ఆరోపణలు రావడంతో, దీనిపై స్పందించాలని అభిమానులు కోరుతున్నారు.రా ఎన్టీఆర్ పేరుతో ఊరు-వాడ కార్యక్రమాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి కానీ, సన్నిహితులకు కానీ ఎలాంటి సంబంధం లేదని, ఆయన అనుమతి లేకుండానే కార్యక్రమాలు చేపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. అభిమానులను సున్నితంగా హెచ్చరిస్తూ, రా ఎన్టీఆర్ కార్యక్రమాలకు ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అంతేకాకుండా, జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన కార్యాలయం ఖండించింది.తిరుపతిలో ఉండే జూనియర్ ఎన్టీఆర్ రాష్ట్ర ఫ్యాన్స్ కన్వీనర్ కృష్ణ యాదవ్ ఈ విషయమై మరింత స్పష్టత ఇచ్చారు. రా ఎన్టీఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. “ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే దానికి ఎన్టీఆర్ గారికి గాని నందమూరి అభిమాన సంఘాలకు గాని ఎటువంటి సంబంధం లేదనేది అఫీషియల్ గా అధికారికంగా నేను చెప్తున్నాను.

మరిన్ని వీడియోల కోసం :

‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..

బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్

‘ఊరు వాడ’ కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?

నాగార్జున ఆ విషయంలో రిస్క్ తీసుకుంటున్నారా..?

Follow Us