హీరోయిన్లపై ఆ ప్రభావం పడదా ?? వీరి భవిష్యత్తుకు ఆ నెల కీలకం

Edited By:

Updated on: May 09, 2026 | 1:26 PM

సినిమా ఫలితాలు హీరోలతో పాటు హీరోయిన్ల కెరీర్‌కూ కీలకం. జూన్‌లో జాన్వీ కపూర్ 'పెద్ది', భాగ్యశ్రీ బోర్సే 'లెనిన్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'దేవర'తో ఆకట్టుకున్న జాన్వీకి 'పెద్ది' నిరూపణ కాగా, తొలి సినిమా విడుదలకు ముందే గుర్తింపు పొందిన భాగ్యశ్రీకి 'లెనిన్' విజయం చాలా ముఖ్యం. ఈ జూన్ సినిమాలు వీరిద్దరి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

సినిమా రిజల్ట్ ప్రభావం హీరోల మీదా? దర్శకుల మీదా ఉన్నంత హీరోయిన్ల మీద ఉంటుందా? అని డిస్కషన్‌ స్టార్ట్ చేయాలేగానీ.. ఎందుకుండదు? సరైన సక్సెస్‌ కోసం వెయిట్‌ చేయాలి. ద్వితీయ విఘ్నాన్ని దాటాలి అంటూ చాలా చాలా ఒపీనియన్స్ వినిపిస్తూనే ఉంటాయి. యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా ఇలాంటి సిట్చువేషన్‌లోనే కనిపిస్తున్నారు జూన్‌ నాయికలు. ఇంతకీ ఎవరు వారు? ‘దేవర’ మూవీతో జాన్వీ కపూర్‌ సౌత్‌ స్క్రీన్స్ మీదకు దూసుకొచ్చినప్పుడు మనమ్మాయి మనింటికి వచ్చేందన్న ఆనందం కనిపించింది తెలుగు కుర్రాళ్లలో. తంగం కేరక్టర్‌లో కనిపించారు జాన్వీ. కేరక్టర్‌ నిడివి పెద్దగా లేకపోయినా, ఫస్ట్ సినిమాతో ఓకే అనిపించుకున్నారు. వెంటనే సెకండ్‌ మూవీ పెద్దికి సైన్‌ చేసేశారు. ఆల్రెడీ పెద్ది ప్రమోషనల్‌ కంటెంట్‌తో బాగానే క్లిక్‌ అయ్యారీ బ్యూటీ. జూన్‌ 4న అదే క్రేజ్‌తో థియేటర్లను మెస్మరైజ్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెద్దితో జూన్‌ ఫస్ట్ వీక్‌లో జాన్వీ మిరాకిల్‌ చేస్తే, జూన్‌ లాస్ట్ వీక్‌లో మేజిక్‌ చేయడానికి నేను రెడీగా ఉన్నానని అంటున్నారు భాగ్యశ్రీ బోర్సే. డెబ్యూ మూవీ రిలీజ్‌ అయినా కాకముందే కుర్రాళ్లకు నచ్చేసిన భామ భాగ్యశ్రీ. రూపురేఖలు బావున్నాయి… ఏ హీరోతో జోడీ కట్టినా సెట్‌ అవుతుందని మేకర్స్ కూడా ఫస్ట్ రిలీజ్‌కన్నా ముందే అడ్వాన్సులు చాలానే ఇచ్చేశారు. తొలి, మలి సినిమాలు ఆడకపోతేనేం.. ఈ ఏడాది చూడండి లెనిన్‌లో భారతి కేరక్టర్‌తో చెలరేగిపోతాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది భాగ్యశ్రీలో. ఆమెలో ఉన్న నమ్మకానికి సింబాలిక్‌గానే ‘లెనిన్‌’లో భారతి కేరక్టర్‌ నయా లుక్‌ని రివీల్‌ చేసింది టీమ్‌. పుట్టినరోజు జరుపుకుంటున్న భాగ్యశ్రీకి ఈ సినిమా అయినా కలిసిరావాలని కోరుకుంటున్నారు అభిమానులు. సో ఫస్ట్ వీక్‌ని జాన్వీ రూల్‌ చేస్తే, లాస్ట్ వీక్‌ని భాగ్యశ్రీ గ్రాబ్‌ చేసేయాలని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

NTR: తారక్ బర్త్ డేకు మతిపోయే సర్‌ప్రైజ్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..

ఇన్‌స్టాగ్రామ్ షాక్.. స్టార్స్‌కు మాస్టర్ స్ట్రోక్

వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా

ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసుకుని తిన్నారు.. ఆ తర్వాత..

Follow Us