Prabhas – Hanu Raghavapudi: బిగ్ అప్డేట్.! ఈ సారి ఇంకాస్త కొత్తగా.. లవ్ స్టోరీస్ తో మళ్లీ డార్లింగ్.

|

Nov 21, 2023 | 9:24 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ బాహుబలి తర్వాత ఇప్పటివరకు ఒక్క హిట్ అందుకోలేకపోయారు డార్లింగ్. దీంతో ఇప్పుడు ఆయన నటిస్తోన్న అప్ కమింగ్ మూవీస్ పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమాల్లోనే మరో క్రేజీ ఫిల్మ్ వచ్చి చేరిందిప్పుడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ బాహుబలి తర్వాత ఇప్పటివరకు ఒక్క హిట్ అందుకోలేకపోయారు డార్లింగ్. దీంతో ఇప్పుడు ఆయన నటిస్తోన్న అప్ కమింగ్ మూవీస్ పైనే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సినిమాల్లోనే మరో క్రేజీ ఫిల్మ్ వచ్చి చేరిందిప్పుడు. అయితే తాజాగా సలార్, కల్కి చిత్రాలపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండు సినిమాలను ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా చాలా కాలం తర్వాత సలార్ సినిమాలో ఫుల్ మాస్ యాక్షన్ మీల్స్ అందించబోతున్నారు ప్రభాస్. ఇవే కాకుండా డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో డార్లింగ్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇవే కాకుండా అటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీ చేయనున్నారు ప్రభాస్. వీటన్నింటికి తోడు కొత్తగా… డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో అందమైన ప్రేమకథ చేయనున్నారని కొన్ని రోజులుగా టాక్ నడుస్తుంది. అధికారికంగా ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారట హను. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ మూవీ స్టోరీ ఉంటుందని.. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో టాక్. ఇక ఇదే నిజమైతే ప్రభాస్ ఖాతాలో మరో భారీ బడ్జెట్ మూవీ చేరినట్లే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 21, 2023 09:19 AM