Allu Arjun – Salman Khan: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్ ఖాన్..

|

Sep 11, 2024 | 4:07 PM

సినిమాల సెలెక్షన్స్ కు సంబంధించి ఒక్కో హీరో జడ్జిమెంట్ ఒక్కోలా ఉంటుంది. ఒక స్టార్ హీరో వద్దన్న సినిమా ఇంకో హీరో వద్దకు వెళ్లడం, అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యాడు. ఇదే మూవీతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏంటో తెలుసా? బజరంగీ భాయిజాన్.

సినిమాల సెలెక్షన్స్ కు సంబంధించి ఒక్కో హీరో జడ్జిమెంట్ ఒక్కోలా ఉంటుంది. ఒక స్టార్ హీరో వద్దన్న సినిమా ఇంకో హీరో వద్దకు వెళ్లడం, అవి బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం ఇండస్ట్రీలో సర్వ సాధారణం. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ అయ్యాడు. ఇదే మూవీతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ సినిమా ఏంటో తెలుసా? బజరంగీ భాయిజాన్. అవును ఈ సినిమాలో మొదట హీరోగా అల్లు అర్జున్ ను అనుకున్నారట మేకర్స్. ఇక ఈ మూవీ నిర్మాత ఉదయవాణి ముందుగా బన్నీకే ఈ సినిమా కథ వినిపించారట. అయితే అప్పటికే టాలీవుడ్ లో స్టైలిష్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడట.

అంతేకాకుండా అప్పట్లో సౌత్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టిన బన్నీ బాలీవుడ్ సినిమా చేయడం కరెక్ట్ కాదేమోనని అనుకున్నాడట. అలా అల్లు అర్జున్ నో చెప్పిన తర్వాత బజరంగీ కథ కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ దగ్గరకు వెళ్లిందట. ఆయన కూడా వేరే ప్రాజెక్టులలో బిజీగా ఉన్నానని, ఈ స్టోరీ తనకు సూట్ అవ్వదంటూ చేతలెత్తేశాడట. అలా అల్లు అర్జున్, రజనీకాంత్‌లు రిజెక్ట్ చేసిన కథను ఆఖరిగా సల్మాన్ ఖాన్ దగ్గరకు తీసుకెళ్లారట డైరక్టర్ కబీర్ ఖాన్. ‘బజరంగీ భాయిజాన్’ సినిమా కథ సల్మాన్ ను ఎంతగానో ఇంప్రెస్ చేసిందట. అందుకే కథ విన్న వెంటనే సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారట. అలా సినిమా సెట్స్ పైకి వెళ్లడం, రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం చకా చకా జరిగిపోయాయి. ఇక 2015లో రిలీజైన బజరంగీ భాయిజాన్ ఓవరాల్ గా 960 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ సినిమా సల్మాన్ కెరీర్ లో మరో మైలురాయిలా నిలిచిపోయింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on