హీరోయిన్ ఇమేజ్‌కు భయపడట్లేదు.. కూతుళ్లు, అక్కలు, చెల్లెళ్లుగా మారుతున్న స్టార్ బ్యూటీస్!

Edited By:

Updated on: Aug 24, 2026 | 7:52 PM

హీరోయిన్ ఇమేజ్ దెబ్బతింటుందనే భయంతో చాలామంది కథానాయికలు సైడ్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటారు. కానీ అనస్వర రాజన్, నయనతార, కీర్తి సురేష్, ప్రీతి ముకుందన్, మమిత బైజు వంటి హీరోయిన్లు మాత్రం కథ నచ్చితే విభిన్న పాత్రలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అనస్వర ‘కాకా’లో చిరంజీవి కూతురిగా, నయనతార ‘టాక్సిక్’లో యశ్ అక్కగా నటిస్తున్నారు. ఇలా హీరోయిన్లు కొత్త రూట్‌లో పయనిస్తున్నారు.

మామూలుగా హీరోయిన్ ఆఫర్స్ వస్తున్నపుడు.. సైడ్ ట్రాక్ పట్టాలన్నా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు హీరోయిన్లు. ఎక్కడ తమ ఇమేజ్ దెబ్బ తింటుందో అని ఆలోచిస్తుంటారు. కానీ ఇక్కడ కొందరు బ్యూటీస్ మాత్రం హీరోయిన్‌గా నటిస్తూనే.. కథ నచ్చితే కూతుళ్లు, చెల్లెళ్లు అయిపోతున్నారు. మరి ఆ లాజిక్ ఏంటి..? ఇంతకీ ఎవరా హీరోయిన్లు..? హీరోయిన్ కెరీర్ ఉండేదే మహా అయితే మూడేళ్లు.. ఈ గ్యాప్‌లో మళ్లీ కూతురు, చెల్లిగా మారిపోతే వచ్చే ఆఫర్స్ కూడా రావనే భయం చాలా మంది బ్యూటీస్‌లో ఉంటుంది. కానీ ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్‌లో ఆ భయం కనిపించట్లేదు.. హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉన్నా కాకా సినిమాలో చిరు కూతురుగా నటిస్తున్నారీమే. దాంతో పాటు సంగీత్ శోభన్ సినిమా, ఇట్లు అర్జునలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అనస్వర రాజన్ మాత్రమే కాదు.. నయనతార లాంటి పెద్ద హీరోయిన్ కూడా ఇలాంటి డిఫెరెంట్ రోల్స్ చేస్తున్నారు. ఆ మధ్య చిరంజీవి గాడ్ ఫాదర్‌లో చెల్లిగా నటించిన నయన్.. తాజాగా టాక్సిక్‌లో యశ్‌ అక్కగా నటిస్తున్నారు. ఇందులో చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు నయన్. ఆ మధ్య కీర్తి సురేష్ సైతం భోళా శంకర్‌లో చిరంజీవి చెల్లిగా నటించారు. బ్లాస్ట్ సినిమాతో బ్లాస్టింగ్ హిట్ కొట్టిన ప్రీతి ముకుందన్ సైతం విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. అందులో అర్జున్ కూతురుగా నటించారు ప్రీతి. అలాగే ట్రెండింగ్ బ్యూటీ మమిత బైజు కూడా విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లహం కుడుంబం యూనిట్ లాంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ.. జన నాయకుడులో విజయ్ కూతురుగా నటించారు. మొత్తానికి మన హీరోయిన్లు రిస్క్ తీసుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold Price: పసిడి పరుగులు.. ఇవాళ తులం బంగారం ధర ఇదే!

ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

ఎయిర్‌హోస్టెస్ నుంచి పోలీస్ ఆఫీసర్‌గా వచ్చింది.. అవినీతి ఊబిలో చిక్కుకొని..

2026 Lunar Eclipse: ఆగస్టు 28న ఆకాశంలో అద్భుతం.. భారత్‌లో కనిపిస్తుందా?

గంటల తరబడి మొబైల్‌ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!

Loading...
Unable to load recommendations.
Follow Us