సినిమాల తర్వాత ప్రజాసేవే లక్ష్యం.. రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్
G. V. Prakash Kumar చేసిన తాజా వ్యాఖ్యలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. సినీ కెరీర్ అనంతరం ప్రజాసేవపై దృష్టి పెట్టాలని ఉందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే పలువురు తమిళ సినీ ప్రముఖులు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో జీవీ ప్రకాశ్ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భవిష్యత్తులో తన ఆలోచనలకు సరిపోయే వేదికతో కలిసి పనిచేయడానికి సిద్ధమని చెప్పారు.
తమిళ సినిమాలే కాదు.. చూస్తుంటే తమిళ స్టార్ నటులు దశాబ్దాలుగా ఒకే ప్యాట్రన్‌లో వెళుతున్నట్టు కనిపిస్తోంది. మొదట సినిమాల్లోకి రావడం, కష్టపడడం.. తమని తాము నిరూపించుకోవడం.. తమ కంటూ స్ట్రాంగ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం.. ఓ ఫైన్ డే ప్రజా సేవ అంటూ.. రాజకీయాల్లోకి దూకేయడం! అక్కడ పాజిబుల్ అయితే ఓకే.. లేదంటూ మళ్లీ బ్యాక్ టూ సినమాస్.!!! అచ్చం ఇలాగే చేస్తుంటారు అక్కడి హీరోలు. రీసెంట్ విజయ దళపతి అక్కడ సంచలనం సృష్టించి.. ఏకంగా ఫస్ట్ అటెంప్ట్‌లోనే సీఎం అయిపోయాడు. దీంతో ఈయన దారిలో నడించేందుక మరికొంత మంది స్టార్లు ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే లారెన్స్ తాను రాజకీయాల్లోకి వెళుతున్నట్టుగా అఫీషియల్‌గా చెప్పేశాడు. ఇప్పుడేమో జీవీ ప్రకాశ్ కూడా ప్రజా సేవ చేయాలని ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పి ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ అవుతున్నాడు. ఓ పక్క మ్యూజిక్ డైరెక్టర్‌గా.. మరో పక్క హీరో.. ప్రొడ్యూసర్‌గా.. కోలీవుడ్ లో తెగ బిజీగా ఉన్న జీవీ ప్రకాశ్.. రీసెంట్ ఇంటెర్వ్యూలో పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి కర కామెంట్స్ చేశాడు. తన సినీ ప్రయాణం ఇంకో 15 ఏళ్లు కొనసాగుతుందో లేదో చెప్పలేనని జీవీ ప్రకాశ్ అన్నాడు. ఆ తర్వాత తాను ప్రజాసేవపైనే దృష్టి పెడతానని కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు తన ఆలోచనలకు సరిపోయే వేదిక దొరికితే కలిసి పనిచేయడానికి సిద్ధమని జీవీ అన్నాడు. తన మాటలతో… తన ఫ్యూచర్ ప్లాన్ పాలిటిక్స్ వైపే అన్నట్టు ఇండైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు ఈ ట్యాలెంటెడ్ స్టార్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమ చేసిన హత్య? పాపం! సంచిత!
బిగ్ బాస్ 10 ఫస్ట్ కంటెస్టెంట్‌గా.. సీరియల్ బ్యూటీ ఫిక్స్?
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ.. బ్రతకాలని లేదా నీకు!
