అజ్ఞాతవాసానికి కార్తికేయ స్వస్తి చెప్పేదెప్పుడు ??
తెలుగులో హిట్స్ చూసిన యువ హీరోలు కొందరు మధ్యలో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వారు మళ్ళీ ఫామ్‌లోకి వస్తున్నారు. శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి', 'బైకర్' తో బిజీగా ఉంటే, వైష్ణవ్ తేజ్ కొత్త సినిమాకి సిద్ధమవుతున్నారు. 'RX 100' కార్తికేయ కూడా తదుపరి ప్రాజెక్టుల కోసం వేచి చూస్తున్నారు. ఈ యువ తారల రీఎంట్రీలు, రాబోయే చిత్రాలపై ఆసక్తి నెలకొంది.
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్‌లు చూసిన యంగ్ హీరోలు కొందరున్నారు. ఎందుకో వాళ్లు సడన్ గా సైలెంట్‌గా మారిపోయారు. అలాంటి సైలెన్స్ నుంచి ఈ మధ్య నారి నారి నడుమ మురారితో బయటికి వచ్చేశారు శర్వానంద్.. బైకర్‌తో రయ్ రయ్ మనడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇంతకీ మిగిలిన వాళ్లెవరబ్బా అంటారా? చూసేద్దాం పదండి.. బైకర్ కోసం యమా కష్టపడుతున్నారు శర్వానంద్. అంతకు ముందున్న వెయిట్ అంతా లాస్ అయి యమా ఫిట్‌గా తయారయ్యారు. ఈ సినిమా మీద మామూలు హోప్స్ కాదు శర్వాకి ఉన్నది… రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారితో సంక్రాంతి సెంటిమెంట్‌ను కూడా క్యాష్ చేసుకున్నారు.. శర్వానంద్‌లాగా ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు వైష్ణవ్ తేజ్. 35 చిన్న కథ కాదు డైరక్టర్ నందకిశోర్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఆల్రెడీ ఉప్పెనతో 100 కోట్లు చూసిన హీరోకి, మంచి సెన్సిబిలిటీస్ ఉన్న కెప్టెన్ తోడైతే సినిమా ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఆర్స్ ఎక్స్ 100 తర్వాత కూడా హిట్స్ చూసిన కార్తికేయ ఎందుకు సైలెంట్ గా ఉన్నట్టు… అనే మాటలు అడపాదడపా వినిపిస్తున్నాయి. హీరోగానే కాదు, విలన్‌గా కూడా ప్రూవ్ చేసుకున్న కార్తికేయ నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారోననే ఆసక్తి జనాల్లో ఉండటం కామన్. మరి నియర్ ఫ్యూచర్‌లో కార్తికేయ నుంచి ఏమైనా ఖబర్ వస్తుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేషనల్ జియోగ్రాఫిక్ 33 లిస్టులో ప్రియాంక, ఆలియా
Spider-Man: ఆకట్టుకుంటున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్
Dhurandhar 2: సూపర్ డూపర్ టాక్ తో దూసుకుపోతున్న ధురంధర్
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
Petrol Price: జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
