నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్‌

Updated on: Sep 27, 2026 | 11:51 AM

ఫ్రెంచ్‌ నటుడు, దర్శకుడు ఆర్నాడ్‌ డెనిస్‌ 43 ఏళ్ల వయసులో బెల్జియంలో యూతనేసియా ద్వారా ప్రాణాలు విడిచారు. హెర్నియా చికిత్స తర్వాత అమర్చిన ఇంప్లాంట్‌తో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక నొప్పితో బాధపడినట్లు ఆయన న్యాయవాది తెలిపారు. యూతనేసియా అంటే నయం కాని తీవ్రమైన పరిస్థితుల్లో, చట్టపరమైన వైద్య ప్రక్రియల ద్వారా వ్యక్తి జీవితాన్ని ముగించడాన్ని సూచిస్తుంది. డెనిస్‌ మరణానికి ముందు తన అనుభవాలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఆర్నాడ్ డెనిస్ 43 ఏళ్ల వయసులో కారుణ్య మరణం ద్వారా ప్రాణాలు విడిచారు. అసలు కారుణ్య మరణం అంటే ఏంటి? నయం చేయలేని తీవ్రమైన వ్యాధితో బాధపడుతూ, భరించలేని నొప్పితో.. కోలుకునే అవకాశం లేని వ్యక్తి తన ప్రాణాలను చట్టబద్ధంగా తీసుకోవాలనుకోవడం.. లేదా వైద్యుల సహాయంతో మరణించడం. ఇక ఆర్నాడ్ డెనిస్ విషయానికి వస్తే.. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కొన్నేళ్లుగా పోరాడిన ఆయన.. బెల్జియంలో కారుణ్య మరణం పొందినట్లు ఇంటర్నేషనల్ మీడియా చెబుతోంది. హెర్నియా సర్జరీ తర్వాత వచ్చిన సైడ్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా డెనిస్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నొప్పిని భరించలేక, వైద్యులను సంప్రదించించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు నటుడి లాయర్‌ మీడియాకు తెలిపారు. అంతేకాదు తన మరణానికి ముందు సోషల్ మీడియాలో ఆర్నాడ్ ఒక భావోద్వేగభరిత సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చనిపోయే ముందు ఆర్నాడ్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఏం రాసుకొచ్చాడంటే… ‘నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నన్ను తలచుకోవాలని ఆశిస్తున్నా. నా ఆరోగ్య సమస్య తీవ్రమైనది. మూడేళ్ల నుంచి భరించలేని బాధను అనుభవించా. ఇక నా వల్ల కావడం లేదు. కండరాల్లో బలం పూర్తిగా తగ్గిపోయింది. ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోయాను. పరిస్థితి నరకంగా మారింది. అందుకే జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాను. ఈ పోరాటంలో నాకు తోడుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. అయితే, నా నిర్ణయం ఎవరినీ ప్రేరేపించొద్దని కోరుకుంటున్నా. నా మరణంతో ఈ ఆరోగ్య సమస్య ఎంత ఘోరంగా ఉంటుందనేదానిపై ప్రజలకు అవగాహన కలుగుతుందని ఆశిస్తున్నా. వైద్యులు దీనిపై మరింత పరిశోధనలు జరిపి.. చికిత్స మార్గాలు అన్వేషించడానికి నా మరణం ఉపయోగపడాలని కోరుకుంటున్నా’’ అని ఫేస్‌బుక్‌లో ఆర్నాడ్ డెనిస్ తన బాధను వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Paradise: నాని ‘ప్యారడైజ్’ ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

Loading...
Unable to load recommendations.
Follow Us