Sai Pallavi: మాట మార్చిన సాయి పల్లవి.. ఫ్లాప్ ఎఫెక్టా..?

Edited By:

Updated on: May 09, 2026 | 1:34 PM

"ఏక్ దిన్" టైటిల్‌కు తగ్గట్టే ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. ఈ బాలీవుడ్ డెబ్యూ డిజాస్టర్‌పై సాయి పల్లవి స్పందించారు. కథ నచ్చినా, సినిమా చూశాక పాత్రకు తాను సరిపోలేదని గ్రహించానన్నారు. అమీర్ ఖాన్‌కి కూడా ఈ విషయం చెప్పినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ "రామాయణం" చిత్రంపైనే ఉన్నాయి.

ఏక్ దిన్.. టైటిల్‌కు పర్ఫెక్టుగా న్యాయం చేసిన సినిమా ఇది. అదెలా అనుకుంటున్నారా..? ఇది మనం అంటున్న మాట కాదు.. సోషల్ మీడియాలో వస్తున్న మీమ్స్. టైటిల్ ఏక్ దిన్ కావడంతో నిజంగానే ఒక్కరోజుకే పరిమితం అయిపోయింది ఈ సినిమా అంటున్నారు మీమర్స్. ఈ సినిమాపై తాజాగా సాయి పల్లవి చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఈమె ఏమంటున్నారు..? సాయి పల్లవి సినిమా అంటే ఎలా ఉన్నా కూడా ఓసారి చూడొచ్చు అంటుంటారు అభిమానులు. ఆమె కోసమే చూసే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఆమె ఉన్నా ఏక్ దిన్ సినిమాను మాత్రం చూడలేకపోయారు ఫ్యాన్స్. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించిన ఈ చిత్రంతోనే సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ చేసారు కానీ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఏక్ దిన్ ఫ్లాప్ తర్వాత సాయి పల్లవి చేస్తున్న కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కథ విన్నపుడు హాలీవుడ్ క్లాసిక్ బిఫోర్ సన్‌రైజ్ సినిమాలా అనిపించి ఓకే చేసానని.. కానీ ఫస్ట్ కాపీ చూసాక ఈ పాత్రకు తాను సరిపోలేదని అర్థం అయిందన్నారు సాయి పల్లవి. ఇదే మాట అమీర్ ఖాన్‌కు కూడా చెప్పానన్నారు ఈ బ్యూటీ. ఈ లెక్కన ఏక్ దిన్ ఫ్లాప్ ముందే ఊహించారు సాయి పల్లవి. ఏక్ దిన్ ఫ్లాప్‌తో బాలీవుడ్‌లో డ్రీమ్ డెబ్యూకు దూరంగా ఉండిపోయారు సాయి పల్లవి. ప్రస్తుతం ఈమె ఆశలన్నీ రామాయణ సినిమాపైనే ఉన్నాయి. దివాళికి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. ఇందులో సీతమ్మ పాత్రలో నటిస్తున్నారు పల్లవి. మొత్తానికి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఏక్ దిన్ ఫ్లాపయ్యాక అసలు విషయం చెప్పారు సాయి పల్లవి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

2027 సంక్రాంతికి సూపర్ స్టార్ సడన్ ఎంట్రీ

హీరోయిన్లపై ఆ ప్రభావం పడదా ?? వీరి భవిష్యత్తుకు ఆ నెల కీలకం

NTR: తారక్ బర్త్ డేకు మతిపోయే సర్‌ప్రైజ్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..

ఇన్‌స్టాగ్రామ్ షాక్.. స్టార్స్‌కు మాస్టర్ స్ట్రోక్

Follow Us