Week Names Titles: వారల పేరులను టైటిల్స్ గా మార్చేస్తున్న దర్శకులు.. టైటిల్స్ అదుర్స్.
అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ టైటిల్‌కి అనర్హం అంటున్నారు మన దర్శకులు. టైటిల్ కొత్తగా ఉన్నపుడే ఆసక్తి కూడా డబుల్ అవుతుంది. ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే వారాల పేర్లనే సినిమా టైటిల్స్‌గా పెట్టేస్తున్నారు. తాజాగా శనివారాన్ని నాని తీసుకున్నారు. మరి ఇలా వచ్చిన టైటిల్స్ ఏంటో ఓ లుక్ వేద్దామా.. సరిపోదా శనివారం.. టైటిల్ వినడానికి వినూత్నంగా ఉంది కదా..!
అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నట్లు.. కాదేదీ టైటిల్‌కి అనర్హం అంటున్నారు మన దర్శకులు. టైటిల్ కొత్తగా ఉన్నపుడే ఆసక్తి కూడా డబుల్ అవుతుంది. ఇప్పుడు ఇదే రూట్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే వారాల పేర్లనే సినిమా టైటిల్స్‌గా పెట్టేస్తున్నారు. తాజాగా శనివారాన్ని నాని తీసుకున్నారు. మరి ఇలా వచ్చిన టైటిల్స్ ఏంటో ఓ లుక్ వేద్దామా.. సరిపోదా శనివారం.. టైటిల్ వినడానికి వినూత్నంగా ఉంది కదా..! ఏదో ఓ రెగ్యులర్ టైటిల్ పెట్టుంటే దీని గురించి అంతగా మాట్లాడుకోడానికి విషయం ఉండేది కాదు. కానీ సరిపోదా శనివారం అంటూ వచ్చేస్తున్నారు నాని. అంటే సుందరానికి తర్వాత మరోసారి డిఫెరెంట్ టైటిల్‌తోనే రాబోతున్నారు వివేక్ ఆత్రేయ. తాజాగా ఈ కాంబినేషన్ షురూ అయింది.. యాక్షన్ థ్రిల్లర్‌గా సరిపోదా శనివారం వచ్చేస్తుంది. వారాలతో సినిమాల టైటిల్స్ రావడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న సినిమాకు మంగళవారం టైటిల్ ఫిక్స్ చేసారు. ఓ ఊర్లో మంగళవారాలు వరసగా మనుషులు చనిపోతుంటారు. దీని వెనక మిస్టరీనే సినిమా కథ. నవంబర్ 17న మంగళవారం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తి పెంచేసింది. రెండేళ్ళ కింద తెల్లవారితే గురువారం పేరుతో ఓ సినిమా చేసారు కీరవాణి కొడుకు సింహా. దానికి ముందు ఆదివారం ఆడవాళ్లకు సెలవు అనే సినిమా వచ్చింది. అంతేకాదు.. ఏ వెన్నెస్ డే పేరుతో వచ్చిన నసీరుద్దీన్ షా సినిమా అప్పట్లో సంచలనం. అదే ఈనాడు పేరుతో తెలుగులో రీమేక్ అయింది. శుక్రవారం, సోమవారం పేరుతోనూ సినిమాలు వచ్చాయి. ఇక నెలలే మిగిలాయి.. వాటిని వాడేస్తారేమో మన దర్శకులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..