ధురంధర్ గుణపాఠం.. నేర్చుకుంటారా మరి..?
ధురంధర్ భారతీయ సినిమా సీక్వెల్స్‌కు కొత్త పాఠం నేర్పింది. ఒకేసారి రెండు భాగాలను చిత్రీకరించి, నాలుగు నెలల్లో రూ.3000 కోట్ల బిజినెస్ సాధించింది. ఇతర భారీ చిత్రాలు సీక్వెల్స్ కోసం ఏళ్లు తీసుకుంటున్నప్పుడు, ధురంధర్ ముందుచూపుతో పక్కా ప్రణాళిక, బడ్జెట్ నియంత్రణ, ప్రేక్షకులను వేచి చూడకుండా భారీ విజయం ఎలా సాధించవచ్చో చూపింది. ఇది భారతీయ చిత్ర పరిశ్రమకు ఆదర్శప్రాయమైన మార్గదర్శకం.
ధురంధర్ ఇండియన్ సినిమాకు ఏం నేర్పించింది..? సీక్వెల్స్ ఎలా చేయకూడదో నేర్పించిందా లేదంటే ఇలాగే చేయాలని కనువిప్పు కలిగించిందా..? 4 నెలల్లో 3000 కోట్ల బిజినెస్ ఎలా సాధ్యమైంది..? ఒకేసారి 8 గంటలకు పైగా సినిమాను ఓ దర్శకుడు ఎలా ప్లాన్ చేయగలిగాడు..? సీక్వెల్స్ కోసం ఏళ్లకేళ్ళు తీసుకుంటున్న మన మేకర్స్‌కు ధురంధర్ సినిమా ఏం పాఠం నేర్పించింది..? బాహుబలి, కేజీయఫ్, పుష్ప లాంటి సినిమాలన్నీ రికార్డులు తిరగరాసినా.. వాటి సీక్వెల్స్ థియేటర్లలోకి రావడానికి మాత్రం ఏళ్లకేళ్లు పట్టింది. కల్కి, దేవర, సలార్ లాంటి భారీ చిత్రాల సెకండ్ పార్ట్స్ ఎప్పుడొస్తాయో తెలియక ఆడియన్స్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.. మొదటి భాగం సక్సెస్ అయ్యాక తీరిగ్గా కథలు అల్లుకుంటూ కూర్చోవడం వల్లే మన మేకర్స్ ఇంతలా టైమ్ తీసుకుంటున్నారనేది కాదనలేని వాస్తవం. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నపుడు కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను కేవలం నెల రోజుల గ్యాప్‌లో రిలీజ్ చేసారు క్రిష్. అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. కానీ డైరెక్టర్ ఆదిత్య ధర్ మాత్రం ధురంధర్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో అడుగులేసి ట్రెండ్ సెట్ చేసారు. ఏకంగా 14 నెలల ప్రీ ప్రొడక్షన్.. 12 నెలలు షూటింగ్‌తో రెండు పార్టులను ఒకేసారి కంప్లీట్ చేసారు. డిసెంబర్ 5వ తేదీన విడుదలైన ధురంధర్ పార్ట్ 1 ఊహించని రేంజ్‌లో 1400 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఏమాత్రం లేట్ చేయకుండా వేడి తగ్గకముందే మార్చి 19న ధురంధర్ 2 సినిమాను కూడా థియేటర్లలోకి దించేశారు. ఇప్పుడది కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 2000 కోట్ల కలెక్షన్స్ మార్క్ వైపు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తోంది. 1000 కోట్లైతే వారంలోపే వచ్చేలా ఉన్నాయిప్పుడు.పార్ట్ 1 హిట్టయ్యాక హడావిడిగా కథలు రాసుకోకుండా.. ముందే 2 పార్ట్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలో ఆదిత్య ధర్ చూపించారు. ఒకేసారి షూట్ చేయడం వల్ల యాక్టర్స్ డేట్స్ అడ్జస్ట్ చేయడమే కాదు.. బడ్జెట్ అదుపులో ఉంటుందని ప్రాక్టికల్‌గా చూపించింది ధురంధర్. అన్నింటికీ మించి ప్రేక్షకులను ఏళ్ల తరబడి వెయిట్ చేయించకుండా బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ ఎలా ప్లాన్ చేయాలో ధురంధర్ ఒక పర్ఫెక్ట్ పాఠం నేర్పించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆల్ రౌండర్స్ అయిపోతున్న హీరోయిన్లు.. సినిమాల్లో సత్తా చాటుతున్న బ్యూటీస్
హిట్టు కొట్టు గురూ.. లేకపోతే అంతే సంగతులు.. కుర్ర హీరోలకు అల్టిమేటం
పాన్ ఇండియన్ సినిమాలకు సౌత్ బ్యూటీస్ పనికిరారా..?