ఓటీటీ హవాకు చెక్.. కమర్షియల్ సినిమాలతో థియేటర్లలో మళ్లీ జాతర!

Edited By:

Updated on: Jul 13, 2026 | 5:42 PM

థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదన్న వాదనలకు ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’ సినిమాలు గట్టి సమాధానం చెబుతున్నాయి. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరగా, అఖిల్ ‘లెనిన్’ కూడా మాస్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తూ విజయవంతంగా దూసుకెళ్తోంది. మంచి కమర్షియల్ కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఇప్పటికీ బిగ్ స్క్రీన్ అనుభవానికే ప్రాధాన్యం ఇస్తారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఆడియన్స్ థియేటర్లకు రావడం లేదన్న వాదనలకు బ్రేక్ పడిందా. గత కొంతకాలంగా థియేటర్ల వైపు కన్నెత్తి చూడని ప్రేక్షకులు.. బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నారా..? అసలు ‘మా ఇంటి బంగారం’, ‘లెనిన్’ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ప్రూవ్ చేసిందేంటి..? కమర్షియల్ సినిమాకు మళ్లీ పాత రోజులు వచ్చినట్టేనా? డిటైల్డ్‌గా చూద్దాం. టాలీవుడ్‌లో గత కొంతకాలంగా థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోయిందనే కలవరం కనిపించింది. ఓటీటీల హవా, రొటీన్ కంటెంట్‌తో థియేటర్లు వెలవెలబోయాయి. ఆడియన్స్‌ను మళ్లీ థియేటర్లకు రప్పించడం కష్టమే అన్న టైమ్‌లో.. కమర్షియల్ సినిమాలు తమ మ్యాజిక్ చేయడం మొదలుపెట్టాయి. కంటెంట్ ఉన్న కమర్షియల్ బొమ్మ పడితే, జనాలు కచ్చితంగా థియేటర్లకు వస్తారని రీసెంట్ మూవీస్ ప్రూవ్ చేశాయి. సమంత లీడ్ రోల్‌లో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సునామీ అంతాఇంతా కాదు. యాక్షన్, ఎమోషన్స్‌తో ఫుల్ కమర్షియల్ ప్యాకేజీగా వచ్చిన ఈ సినిమా ఏకంగా 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతూ రికార్డులు క్రియేట్ చేసింది. ముఖ్యంగా లేడీస్ అండ్ మాస్ ఆడియన్స్ థియేటర్లకు బ్రహ్మరథం పడుతుండటంతో.. కమర్షియల్ ఫార్ములాకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. అక్కినేని అఖిల్ ‘లెనిన్’ సినిమా కూడా థియేటర్లకు జోష్‌ తీసుకువచ్చింది. పక్కా ఊర మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అఖిల్‌కు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. ‘లెనిన్’ మాస్ జాతరతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. ఈ రెండు సినిమాల సక్సెస్ టాలీవుడ్ మేకర్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మంచి కమర్షియల్ కంటెంట్ ఉంటే ఆడియన్స్ థియేటర్లకు రావడం పక్కా అనే భరోసా ఇచ్చాయి. మరి రానున్న రోజుల్లో రాబోయే భారీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఇంకెలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రశాంతమైన మరణానికి మార్గం సుగమం!!

రైల్లో రెచ్చిపోయిన కొత్తజంట.. దెబ్బకు టీసీ ఉద్యోగం ఊస్ట్‌!

ఈసీజీ కూడా కనిపెట్టలేనిది.. ఏఐ కనిపెట్టేసిందిగా!

Rao Bahadur: స్టార్ హీరో చేయాల్సిన సినిమా.. సత్యదేవ్‌ ఖాతాలోకి వచ్చింది!

ఉప్పునీటితో విద్యుత్‌.. సముద్ర గర్భంలో సరికొత్త విప్లవం

Follow Us