Chiranjeevi: చిన్న సర్జరీ చేశారు.. మరేం పర్లేదు!

Updated on: Feb 18, 2026 | 2:39 PM

సోషల్ మీడియాలో చిరంజీవి భుజం పట్టీపై ఆందోళనలు వ్యక్తమవడంతో, మెగాస్టార్ స్వయంగా స్పందించారు. తనకు చిన్న కీహోల్ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం బాగా కోలుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. ఈ ప్రక్రియకు సహకరించిన ఆర్థోస్కోపీ సర్జన్ డాక్టర్ నితిన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను పూర్తి ఆరోగ్యంతో సాధారణ జీవితంలోకి తిరిగి వస్తున్నానని చిరు అభిమానులకు భరోసా ఇచ్చారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో చిరు షోల్డర్‌ పట్టీనే పెద్ద హాట్ టాపిక్ అవుతోంది. మెగా స్టార్‌కు ఏమైందని అందరూ ఆరా తీయడం.. ఆందోళన చెందడం ఎక్కువవుతోంది. ఈ క్రమంలోనే ఇదంతా గమనిస్తున్న చిరు.. రియాక్టయ్యారు. తనకు జరిగిన చిరు సర్జరీ గురించి.. తనే స్వయంగా వివరిస్తూ ఓ ట్వీట్ చేశారు. తాను బానే ఉన్నానని.. కోలుకుంటున్నాని తన ట్వీట్‌లో కోట్ చేశారు మెగాస్టార్. చేతికి పట్టీ ఉండటం గమనించి పలువురు శ్రేయోభిలాషులు తన ఆరోగ్యం గురించి ఆరా తీశారని తన ట్వీట్‌లో రాసుకొచ్చిన చిరంజీవి… తన భుజానికి చిన్న కీ-హోల్‌ సర్జరీ జరిగిందంటూ క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం తాను బాగానే కోలుకుంటున్నానని.. ఇప్పటికే తనరొటీన్ లైఫ్ కు తిరిగి వస్తున్నా అన్నారు చిరు.ఈ విషయంలో ఆర్థోస్కోపీ సర్జన్‌ డాక్టర్‌ నితిన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సర్జరీ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు, ఆయన నైపుణ్యంతో ఆ ప్రక్రియ అంతా సజావుగా, సౌకర్యవంతంగా సాగిందంటూ.. ఆయన్ను అందరికీ పరిచయం చేశారు. అంతేకాదు తన పట్ల అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు,దీవెనలకు మెగాస్టార్ చిరు సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

With Love: 10 రోజుల్లో 25 కోట్లు..! దుమ్ము దులుపుతున్న విత్ లవ్‌ సినిమా కలెక్షన్స్‌

పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??

ఈ ఆకులతో అద్భుత ప్రయోజనాలు.. ఆ సమస్యలు పరార్‌!

సిమ్‌ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే

ఏరియా 51లోనే ఏలియన్స్‌ ?? అంతరిక్షంలో జీవం ఉంది !!

Follow Us