మెగాస్టార్ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్
టాలీవుడ్‌లో మల్టీప్లెక్స్ బిజినెస్ ట్రెండ్ కొనసాగుతోంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండల బాటలో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అడుగుపెడుతున్నారు. హైదరాబాద్‌లో ఏషియన్ సినిమాస్‌తో కలిసి ప్రీమియం ఎగ్జిబిషన్‌కు కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో మరో మైలురాయి కానుంది.
టాలీవుడ్‌లో ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ట్రెండ్ ఊపందుకుంది. చాలా మంది స్టార్ హీరోలు మల్టీప్లెక్స్ వ్యాపారంలో విజయవంతంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబి, అల్లు అర్జున్ ట్రిపుల్ ఏ, రవితేజ ఏఆర్టీ, విజయ్ దేవరకొండ ఏవిడి సినిమాస్‌లతో ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని అందిస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ రేసులోకి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ ఎంట్రీలోనే ఒక గొప్ప అచీవ్‌మెంట్‌కు సిద్ధమవుతున్నారని ఫిలిం సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.టాలీవుడ్ స్టార్లు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, మల్టీప్లెక్స్ వ్యాపారంపై కూడా దృష్టి పెడుతున్నారు. మహేష్ బాబుతో మొదలైన ఈ ఎగ్జిబిషన్ ట్రెండ్ బన్నీ, రవితేజ, విజయ్ దేవరకొండల సినిమాలతో కొనసాగుతోంది. ఇప్పుడు ఈ మల్టీప్లెక్స్ రంగంలోకి టాలీవుడ్ బాస్ చిరంజీవి అడుగు పెడుతున్నారన్న వార్త అంచనాలను మరింత పెంచుతోంది. మెగాస్టార్ ఏషియన్ సినిమాస్ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్‌లో ప్రీమియం సినిమా ఎగ్జిబిషన్‌కు మరో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసినట్లవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది టాలీవుడ్ వ్యాపార రంగంలో ఒక కీలక పరిణామం కానుంది.
