Chiranjeevi: ఉన్నట్టుండి చిరు ఎమోషనల్ పోస్ట్.. వైరల్

Updated on: Feb 13, 2026 | 11:32 AM

మెగాస్టార్ చిరంజీవి తన తొలి చిత్రం 'పునాది రాళ్లు' సెట్‌లో కెమెరా ముందు నిలిచిన ఫిబ్రవరి 11వ తేదీని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఆ రోజు అనుభూతిని 'అందమైన చందమామ కథ'గా అభివర్ణించారు. తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకం, ప్రోత్సాహంతోనే తన నట ప్రయాణానికి పునాదులు పడ్డాయని చిరు ట్వీట్ చేశారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరు.. సినిమాల్లో తన తొలి అడుగును గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. పునాది రాళ్లు సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలిరోజు ఫిబ్రవరి పదకొండే.. అంటూ ట్వీట్ చేశారు. తొలిసారిగా కెమెరా ముందుకు వచ్చిన వేళ… తనలోని ఆనందాన్ని.. భావోద్వేగాన్ని మాటల్లో వర్ణించలేనంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఆ క్షణం ఇప్పటికీ.. నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుందని.. అదో అందమైన చందమామ కథ లాంటి అనుభూతి అంటూ రాసుకొచ్చారు చిరు. అంతేకాదు ఈ సందర్భంగా.. తనకు ఆ తొలి అవకాశం ఇచ్చిన పునాది రాళ్లు.. దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతోనే… నటనలో తన ప్రయాణానికి పునాదిరాళ్లు పడ్డాయంటూ తన ట్వీట్‌లో కోట్ చేశారు. పునాది రాళ్లు సినిమాలోని తన ఫోటోలను కూడా షేర్ చేశారు చిరు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువకుడి కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి..

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

ఎలుగుబంట్ల బీభత్సం.. వణికిపోతున్న గ్రామ ప్రజలు

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ