కత్తెరకు మరింత పదును పెట్టిన సెన్సార్ బోర్డ్‌

Updated on: Nov 05, 2026 | 11:09 AM

సెన్సార్ బోర్డు కొత్త నిబంధనలు సినీ పరిశ్రమకు సవాళ్లు విసురుతున్నాయి. ఇకపై ఎడిటింగ్, గ్రాఫిక్స్, సంగీతం, సబ్ టైటిల్స్‌తో కూడిన పూర్తి ప్రింట్లను మాత్రమే సెన్సార్‌కు సమర్పించాలి. అసంపూర్తి చిత్రాలను బోర్డు తిరస్కరిస్తుంది. టైటిల్స్ విషయంలోనూ సెన్సార్ ఆమోదం వచ్చేవరకు అధికారికంగా ప్రకటించకూడదని స్పష్టం చేసింది.

ఇప్పటివరకు సినిమా రిలీజ్‌కు కొద్దిరోజుల ముందు అసంపూర్తి ప్రింట్లను పంపించి సర్టిఫికెట్ తెచ్చుకునే అలవాటుకు సెన్సార్ బోర్డు కళ్ళెం వేసింది. కొత్త నిబంధనల ప్రకారం, సినిమా ఎడిటింగ్, గ్రాఫిక్స్, ఫైనల్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సబ్‌టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్‌తో సహా పక్కాగా పూర్తయిన ఫైనల్ వెర్షన్ ప్రింట్‌ను మాత్రమే సెన్సార్‌కు సమర్పించాలి. ఎడిటింగ్ లేదా సీజీ వర్క్ పెండింగ్‌లో ఉన్న వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రింట్లను పంపిస్తే సెన్సార్ బోర్డు వాటిని కనీసం సమీక్షించకుండానే తిరస్కరిస్తుంది.సాధారణంగా మన స్టార్ డైరెక్టర్లు చివరి నిమిషం వరకు సినిమా కరెక్షన్స్‌ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండే సినిమాలకు రిలీజ్ తేదీకి ముందు రోజు వరకు సీజీ వర్క్స్ జరుగుతాయి. ఇప్పుడు ఈ పద్ధతికి కాలం చెల్లింది. అలాగే, సినిమా టైటిల్స్ విషయంలోనూ సెన్సార్ బోర్డు కఠినంగా వ్యవహరిస్తోంది. మేకర్స్ ప్రకటించిన పేరు ఫైనల్ కాదని, సెన్సార్ బోర్డు ఓకే చెప్పేవరకు అది అఫీషియల్ కాదని స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us