బాలీవుడ్ వైపు చూస్తున్న సౌత్ బ్యూటీస్‌.. హిట్స్ లేని చోట వెళ్లి ఏం చేస్తారు

Updated on: Mar 17, 2026 | 4:59 PM

దక్షిణాది అగ్ర నటీమణులు బాలీవుడ్‌లో తమ ప్రభావాన్ని చూపుతున్నారు. రష్మిక మందన ఇప్పటికే పాగా వేయగా, నయనతార, సమంత వంటి తారలు కూడా బాలీవుడ్ ప్రవేశానికి సిద్ధమవుతున్నారు. కీర్తి సురేష్, సాయి పల్లవి, శ్రీలీల వంటి యువ నటీమణులు సైతం ఉత్తరాదిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ పరిణామంతో బాలీవుడ్‌లో సౌత్ తారల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

బాలీవుడ్‌లో సౌత్ అందాల జోరు పెరుగుతోంది. దక్షిణాదిలో టాప్ ప్లేస్‌లో ఉన్న నటీమణులు బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనివల్ల నార్త్ సినిమాల్లో మన హీరోయిన్ల హవా ఎక్కువగా కనిపిస్తోంది. స్టార్ హీరోలు కూడా తమ మార్కెట్‌ను విస్తరించుకోవడానికి దక్షిణాది తారలతో జోడీ కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రష్మిక మందన ఇప్పటికే బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేశారు. తొలి సినిమా నిరాశపరిచినా, యానిమల్, ఛావా చిత్రాలు ఆమెను ఉత్తరాదిలో స్టార్ లీగ్‌లోకి తీసుకువచ్చాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్ సరసన కాక్టెయిల్ 2లో నటిస్తున్నారు. షారుక్ ఖాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నయనతార, త్వరలో సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. అదే చిత్రంతో సమంత రూత్ ప్రభు కూడా బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం కానున్నారని బీటౌన్‌లో చర్చ నడుస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ట్రైలర్‌.. అంచనాలను అందుకుందా ??

నా వరకు ఒకే ఒక్క హీరో.. ఆయనే మెగాస్టార్

Pawan Kalyan: శ్రీలీల డాన్స్ చేస్తే నేను చేయను.. శ్రీలీల షాక్

Pawan Kalyan: పవన్ పంచులకు సుమ షాక్.. ఈ వీడియో చూస్తే నవ్వే నవ్వు

Rajinikanth: “కాలమే సమాధానం చెబుతుంది” రజినీకాంత్ సంచలన లేఖ

Loading...
Unable to load recommendations.
Follow Us