Tiger Shroff: టైగర్ ష్రాఫ్ ఘటనతో ముంబై హీరోల అలర్ట్

Edited By:

Updated on: Oct 24, 2026 | 6:22 PM

టైగర్‌ ష్రాఫ్‌ ఘటన తర్వాత బాలీవుడ్‌ ప్రముఖుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. బెదిరింపుల వార్తల నేపథ్యంలో సల్మాన్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, రణ్‌బీర్‌ కపూర్‌ తమ భద్రతను మరింత కట్టుదిట్టం చేసుకున్నట్లు కథనాలు చెబుతున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బిజీగా ఉన్న సల్మాన్‌ షూటింగ్‌ ప్రదేశాల్లో భద్రతను పెంచినట్లు సమాచారం. అక్షయ్‌ తన నివాసానికి అదనపు రక్షణ ఏర్పాట్లు చేసుకోగా, బాలీవుడ్‌లో సెలబ్రిటీల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

బాలీవుడ్ స్టార్స్‌కి సడెన్‌గా ఏమైంది.. వరుస బెదిరింపులతో ప్రాణభయంతో వణికిపోతున్నారా..? టైగర్ ష్రాఫ్ ఇన్సిడెంట్ తర్వాత సల్మాన్ దగ్గరి నుంచి అక్షయ్ వరకు అంతా సెక్యూరిటీని ఎందుకంత పెంచుకుంటున్నారు..? లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ టార్గెట్‌గా ఉన్న సల్మాన్‌ను చూసి మిగిలిన హీరోలందరికీ అసలు నిద్ర పట్టడం లేదా..? అసలేం జరుగుతుంది ముంబైలో..? మొన్న జరిగిన టైగర్ ష్రాఫ్ ఇన్సిడెంట్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి గట్టిగానే భయం పట్టుకుంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వస్తున్న వార్నింగ్స్‌తో స్టార్ హీరోలంతా హై అలర్ట్ అయిపోతున్నారు. తమ సేఫ్టీతో పాటు ఫ్యామిలీ సేఫ్టీ కోసం ఎవరికి వాళ్ళు సెక్యూరిటీ కట్టుదిట్టం చేసుకునే పనిలో పడ్డారు. ఇంటా బయటా సెక్యూరిటీని మరింత టైట్ చేసుకుంటున్నారు. ఈ బెదిరింపుల వ్యవహారంలో మెయిన్ టార్గెట్ మాత్రం సల్మాన్ ఖాన్ చుట్టూనే తిరుగుతోంది. ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి సినిమాలో బిజీగా ఉన్న ఈ హీరోకి షూటింగ్ లొకేషన్స్‌లో సెక్యూరిటీని ఏకంగా ట్రిపుల్ చేశారు. ఆయన వెళ్లే ప్రతి చోటా అణువణువూ చెక్ చేస్తూ భద్రతను మరింత పటిష్టం చేశారు. ముందు నుంచీ ఉన్న సెక్యూరిటీని ఇంకాస్త పెంచారిప్పుడు. సల్మాన్ ఖాన్ ఒక్కరే కాదు.. అక్షయ్ కుమార్ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన బంగ్లాకు అదనపు భద్రతగా స్పెషల్‌గా బుల్లెట్ ప్రూఫ్ విండోస్ ఏర్పాటు చేసుకుని సేఫ్టీ మెజర్స్ పెంచేశారు. ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశ్యంతో తన పర్సనల్ సెక్యూరిటీ టీమ్‌ను కూడా మరింత స్ట్రాంగ్ చేసుకున్నారు. ఇక రణ్‌బీర్ కపూర్ సైతం ఇదే దారిలో నడుస్తూ తన చుట్టూ ఉన్న సెక్యూరిటీని మరింత టైట్ చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న టెన్షన్స్‌తో ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా తమ ప్రొటెక్షన్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎప్పుడు ఎటు నుంచి ముప్పు వస్తుందోనని స్టార్స్ అంతా హై అలర్ట్‌లో ఉంటూ సేఫ్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?

గన్‌ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?

దంపతుల రీల్స్‌ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా

ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!

Loading...
Unable to load recommendations.
Follow Us