Loading video

వయసు 70.. పైగా 4వ పెళ్లి! స్టార్ నటుడి వైఖరి వైరల్

|

Mar 22, 2025 | 1:06 PM

ప్రస్తుతం బాలీవుడ్‌లో నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ ల డేటింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా వీరిద్దరి ఏజ్ గ్యాప్ గురించి నెట్టింట తీవ్రమైన చర్చ నడుస్తోంది. అయితే ఇదో పక్క జరుగుతుండగానే ఇంకో పక్క బాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ నటుడు కబీర్ బేడి.. 70 ఏళ్ల వయసులో నాలుగో సారి వివాహం చేసుకున్నాడు. అది కూడా తన కూతురి వయసున్న 29 ఏళ్ల నటితో.

దీంతో ఈయన వైఖరి ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్ అవుతోంది. నెట్టింట వైరల్ అవుతోంది. హిందీతో పాటు పలు తెలుగు సినిమాల్లోనూ నటించాడీ కబీర్ బేడి. సమంత శాకుంతలం, బాలకృష్ణ పైసా వసూల్, గౌతమీ పుత్ర శాతకర్ణి వంటి తెలుగు సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ నటుడి వ్యక్తిగత జీవితం ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఇప్పటివరకు ఆయన నాలుగు సార్లు వివాహం చేసుకున్నాడు. కబీర్ బేడి మొదటి వివాహం 1969లో నర్తకి ప్రొతిమా బేడితో జరిగింది. వారిద్దరికీ పూజా బేడి, సిద్ధార్థ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత కబీర్ బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రీస్‌ను రెండవసారి వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేదు, ఆ తర్వాత రేడియో ప్రెజెంటర్ నిక్కీని మూడవసారి వివాహం చేసుకున్నాడు కబీర్. కానీ ఈ వివాహ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి వారు 2005 లో విడాకులు తీసుకున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘వేధిస్తున్నాడు.. అన్వేష్‌పై చర్యలు తీసుకోండి’ ఏడుస్తూ రేవంత్‌కు రిక్వెస్ట్

UKలో చిరు పేరుతో దందా..! సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగా స్టార్…

రాధికకు క్రేజీ బాయ్‌ శాపం! ఆ కుర్రాడి ఉసురు తీస్తోంది పాపం!

గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న తొలి హైడ్రోజన్ రైలు

ఎక్కడపడితే అక్కడ రీల్స్‌ చేస్తే ఇలాగే పగుల్తది..