ఆయనకు రూ.50లక్షలు.. ఆమెకు రూ.40 లక్షలు!.. కానీ తనూజకే ఎక్కువ పైసలు
తెలుగు బిగ్‌బాస్ 9 ముగిసింది. కామనర్‌గా అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. మొదటిసారి ఓ సామాన్యుడు ట్రోఫీ గెలిచాడు. ఇతను మొత్తం ₹50 లక్షల నగదు, విలువైన కారును పొందాడు. రన్నరప్ తనుజ నెగెటివిటీని ఎదుర్కొన్నా, ₹37.5 లక్షల భారీ రెమ్యునరేషన్ అందుకుంది. ఈ సీజన్ విజేతల ఆర్థిక వివరాలు ఆసక్తికరంగా మారాయి.
తెలుగు బిగ్‌బాస్ 9 ముగిసింది. 105 రోజుల యుద్ధానికి తెర పడింది. కామనర్ పవన్ కల్యాణ్ పడాల గెలవడం ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. బిగ్‌బాస్ షోలో అడుగుపెడ్తే చాలనుకున్న స్టేజీ నుంచి సీజన్ ట్రోఫీని ముద్దాడే స్థాయికి ఎదిగాడు కళ్యాణ్ పడాల. తొలిసారి తెలుగు బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్న సామాన్యుడిగా చరిత్రకెక్కాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ప్రతి వారానికి రూ.70,000 రెమ్యునరేషన్ అగ్రిమెంట్‌తో హౌస్‌లోకి వచ్చిన కళ్యాణ్ పడాల.. పదిహేను వారాలకుగానూ 10లక్షల 50 వేల రూపాలయను అందుకున్నాడు. దాంతోపాటే బిగ్ బాస్ విన్నర్ అమౌంట్ 35 లక్షలు ప్లస్ మరో 5 లక్షల గిఫ్ట్ క్యాష్‌ను.. అందుకున్నాడు. అంటే మొత్తంగా 50లక్షల రూపాయాలను ఈ సీజన్లో సంపాదించుకున్నాడు కళ్యాణ్ పడాల. దీంతోపాటే 15 లక్షల పైన విలువ చేసే బ్రాండ్ న్యూ మారుతీ సుజికీ విక్టోరిస్ కారును సైతం గెలుచుకున్నాడు. ప్రతీ సీజన్‌లో ఎవరూ ఒకరు సోషల్ మీడియాలో ఎక్కువగా నెగెటివిటీని మూటగట్టుకుంటారు. ఈ సీజన్‌లో తనూజ కూడా అలాగే చాలా ఎక్కువ నెగెటివిటీని.. దానికి సమానంగా ఫ్యాన్స్ నుంచి మద్దతునూ మూటగట్టుకుంది. ఈ కారణంగానే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌గా కాకుండా రన్నర్గా మిగిలిపోయింది. ఇక ఈ విషయం కాస్తా పక్కకు పెడితే.. రెమ్యునరేషన్‌గా తనూజ చాలా పెద్ద మొత్తంలోనే సంపాదించినట్టు తెలుస్తోంది. వారానికి రెండు లక్షల 50 వేల చొప్పున.. 15 వారాలకు గాను.. ఈ సీరియల్ బ్యూటీ.. 37లక్షల 50 వేల రూపాయలను దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొడుకుకు రూ.40 లక్షలు.. అమ్మకు రూ.42 లక్షలు!..ఇద్దరికీ జాక్ పాట్
పవన్ , NTR పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు! తప్పక పాటించాల్సిందే
కొడుకు హత్యకు తండ్రి సుపారీ… ఎందుకో తెలిసి పోలీసులే షాక్
తాజ్‌మహల్ కనిపించుట లేదు.. పొగమంచులో ఉత్తర భారతం
Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. స్పర్శ దర్శనం సమయాలు
