గన్ను తీయాల్సిన అవసరం ఏమొచ్చింది ?? షోలో హాట్ డిస్కషన్

|

Dec 29, 2022 | 9:02 AM

అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి.. షోకు వచ్చిన గెస్టులందర్నీ కాస్త బోల్డ్‌గా.. డేరింగ్‌గా.. ఇరుకున పెట్టేలా ప్రశ్నలడిగి సమాధానాలు రాబడుతున్న బాలయ్య.. తాజాగా జరిగిన పవన్‌ ఎపిసోడ్‌ లో కూడా అదే చేశారట.

అన్‌స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ నుంచి.. షోకు వచ్చిన గెస్టులందర్నీ కాస్త బోల్డ్‌గా.. డేరింగ్‌గా.. ఇరుకున పెట్టేలా ప్రశ్నలడిగి సమాధానాలు రాబడుతున్న బాలయ్య.. తాజాగా జరిగిన పవన్‌ ఎపిసోడ్‌ లో కూడా అదే చేశారట. రాజకీయంగా.. సామాజికంగా.. చాలా ప్రశ్నలు అడిగి.. పవన్ నుంచి సమాధానాలు రాబట్టారట. ఇంటి విషయాలు.. ఇంట్లో విషయాలను కూడా టచ్‌ చేసి.. పవన్ మనోగతం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారట. సినిమాలు… సన్నిహితుల గురించి అడిగి.. పవన్‌ను పూర్తితగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారట బాలయ్య. ఇక ఈ కమ్రంలోనే గన్ను గురించి కూడా ఓ సూటి ప్రశ్న వేశారట బాలయ్య.. పవన్‌కు. ఎస్ ! గన్నులంటే చాలా ఇంట్రెస్ట్ చూపించే పవన్‌ కళ్యాణ్.. తన సినిమాల్లోనూ ఏదో ఒక గన్‌ ఎపిసోడ్‌ ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఒకానొక సందర్భంలో పాటల్లో కూడా గన్ను పెట్టి ఆటోమేటెడ్ వెపన్స్ అంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పారు.

Published on: Dec 29, 2022 09:02 AM